Andhra Pradesh: పొత్తుల కూటమిలో తీన్మార్.. మూడు పార్టీల రియాక్షన్స్ ఇవే..

|

Mar 13, 2024 | 7:59 AM

ఏపీలో పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కలహాలు లేకుండా టార్గెట్ 160 దిశగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేస్తూ.. టికెట్ రాని నేతలను బుజ్జగిస్తున్నారు. తమపార్టీకి సీట్లు తగ్గడంపై బాధకలిగిందని జనసేన నేతలు అంటుంటే.. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాయర్టీ ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు.

Andhra Pradesh: పొత్తుల కూటమిలో తీన్మార్.. మూడు పార్టీల రియాక్షన్స్ ఇవే..
Ap Politics
Follow us on

ఏపీలో పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కలహాలు లేకుండా టార్గెట్ 160 దిశగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచనలు చేస్తూ.. టికెట్ రాని నేతలను బుజ్జగిస్తున్నారు. తమపార్టీకి సీట్లు తగ్గడంపై బాధకలిగిందని జనసేన నేతలు అంటుంటే.. సొంత ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాయర్టీ ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు.

టార్గెట్‌ 160 దిశగా పనిచేయాలని బాబు దిశానిర్దేశం

ఏపీలో పొత్తుల కూటమిలో తీన్మార్ రగడ కనిపిస్తుంది. పొత్తుల తర్వాత మూడు పార్టీల్లో మూడు రకాల రియాక్షన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కిరావడంతో ఏపార్టీ అభ్యర్థి ఎక్కడ పోటీచేస్తే గెలుస్తారో అంచనా వేస్తున్నాయి మూడు పార్టీలు. ఈక్రమంలోనే కసరత్తు మొదలెట్టాయి. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్‌లో 99 సీట్లు ప్రకటించింది టీడీపీ- జనసేన. అందులో టీడీపీ 94మంది అభ్యర్థులను ప్రకటించగా.. మిగిలిన మరో 50 సీట్ల విషయంలో అభ్యర్థులను ఫిల్టర్ చేస్తున్నారు ఆపార్టీ అధినేత చంద్రబాబు. ఈక్రమంలోనే నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. పొత్తుల్లో భాగంగా కలిసి పనిచేయాలని కూటమికి 160 సీట్లు దక్కేలా ఈనెలన్నర రోజులు కృషి చేయాలని నేతలకు సూచిస్తున్నారు చంద్రబాబు. అలాగే సీటు దక్కని నేతలను బుజ్జగిస్తున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే మీత్యాగానికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు చంద్రబాబు.

జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పవన్ సూచన

మరోవైపు పవన్‌ కల్యాణ్ సైతం తమ పార్టీ నేతలకు తక్కువ సీట్లు తీసుకున్నాను అనుకోవద్దు. 175 స్థానాల్లో పోటీ చేస్తున్నవారందరూ మనవాళ్లే అనుకోండి.. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచిస్తున్నారు. అయితే జనసేనకు 24 నుంచి 21కి సీట్లు తగ్గడం బాధగా ఉందన్నారు ఆపార్టీ తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్. బాధ ఉన్నా.. రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడు పవన్‌లా నిర్ణయం తీసుకోలేదన్నారు కిరణ్‌ రాయల్‌.

పొత్తుల తర్వాత ఏపీ కమలంలో రెండు వర్గాలు

పొత్తుల తర్వాత ఏపీ కమలంలో రెండు వర్గాలు తయారయ్యాయి. వలస నేతలు వర్సెస్‌ సీనియర్ లీడర్లు అన్నట్లుగా తయారైంది. పార్టీ జెండా మోసిన వాళ్ల కన్నా..టికెటే అజెండాగా పార్టీలో చేరిన వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తున్నారనే అసంతృప్త జ్వాలలు మొదలయ్యాయి. పొత్తు కన్నా ఒంటరి పోరుతోనే పార్టీకి ప్రయోజనం అని కొందరు.. పార్టీ సిద్దాంతంతో ప్రమేయంలేని.. నిర్మాణం పట్ల అవగాహన లేని వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. గత ఐదేళ్లలో పార్టీ ఆఫీసు గడప తొక్కని వారు ఇప్పుడు సీట్ల కోసం పట్టుబడుతున్నారనేది కొందరి ఆవేదన,ఆరోపణ. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను కాదని తమ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాయర్టీ ఎక్కువ ఇస్తున్నారని సీనియర్లు కన్నెర్ర చేస్తున్నారట. ఇలాగైతే పార్టీ కోసం పనిచేయడం కష్టం.అలాగని పార్టీ వీడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి పార్టీ బలోపేతం కోసం ప్రచారం చేస్తామే తప్ప ఇక్కడ వుండే ప్రసక్తే లేదని కాస్త ఘాటుగా చెప్పాల్సిన వాళ్లకు విషయం చేరవేశారనేది ఓటాక్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..