Andhra Pradesh: నవరత్నాలు అని నవరంధ్రాలు పెట్టారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చివరకు శ్రీలంక పరిస్థితికి తీసుకొస్తున్నారని ఏపీ సీఎం జగన్(CM Jagan) పై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫైర్ అయ్యారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా....

Andhra Pradesh: నవరత్నాలు అని నవరంధ్రాలు పెట్టారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Chandrababu
Follow us

|

Updated on: May 21, 2022 | 7:11 AM

రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చివరకు శ్రీలంక పరిస్థితికి తీసుకొస్తున్నారని ఏపీ సీఎం జగన్(CM Jagan) పై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఫైర్ అయ్యారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో చంద్రబాబు పర్యటించారు. అన్ని విధాలుగా, అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఈ దగా ప్రభుత్వం ఉంటే భావి తరాలు కోలుకోలేవని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్(YSR) కాంగ్రెస్ పార్టీకి ఉరి వేయాల్సిన బాధ్యత మీ పై ఉందన్నారు. వైఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో 30ఇళ్లు కూడా కట్టలేని వ్యక్తి, రెండేళ్లలో 30వేల ఇళ్లు కడతారా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రాలేదు కాని.. స్పెషల్‌ స్టేటస్‌ అనే విస్కీని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎన్నికల ముందు నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచి జేబులకు నవరంధ్రాలు పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం జగన్.. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మూడేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మరో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలపై రూ.11 లక్షల కోట్ల అప్పు భారం పడనుంది. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వానికి, ఏపీలో వైకాపా పాలనకు ఏమాత్రం తేడా లేదు. నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యమంత్రిని అవ్వడానికి కాదు. మీకోసం వచ్చాను. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై పోరాడడానికి, మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయడానికి వచ్చాను.

       – చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

ఇవి కూడా చదవండి

టీడీపీ పాలనలో మిగులు విద్యుత్తును సాధించామన్న చంద్రబాబు ఏనాడు ఛార్జీలు పెంచలేదని అన్నారు. జగన్‌ సీఎం అయిన తర్వాత ఏకంగా ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని.. గ్యాస్‌, వంటనూనె ధరలు ఆకాశాన్నంటాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇంట్లో ఉండే మరుగుదొడ్ల పైనా పన్ను వేయడానికి సిద్ధమవుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Varun Tej: కొత్త ప్రాజెక్ట్ షూరు చేయనున్న మెగా హీరో.. రెగ్యూలర్ షూటింగ్ అప్పుడే.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Peppermint: పుదీనా ఆరోగ్యానికే కాదు.. ఇంటి శుభ్రతలో కూడా బెస్ట్‌.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్