Palnadu: పార్టీకి రాజీనామా చేయడానికి ప్రెస్ మీట్ అనుకుంటే.. పురుగుల మందు తాగాడు

జంగాకు నర్సరావుపేట టిడిపి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అరవింద్ బాబు పేరు ప్రకటించలేదని అంటున్నారు. దీంతో నర్సరావుపేటలోని తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. టిడిపి టికెట్ అరవింద బాబుకు ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు మనస్థాపానికి గురయ్యారు.

Palnadu: పార్టీకి రాజీనామా చేయడానికి ప్రెస్ మీట్ అనుకుంటే.. పురుగుల మందు తాగాడు
Pulimi Rami Reddy
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 20, 2024 | 5:29 PM

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. వైసిపి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది. మరోవైపు టిడిపి మాత్రం ఒక్క టికెట్‌ను మినహాయించి అందరిని ఖరారు చేసింది. ఇప్పుడు ఆ ఒక్క టికెటే పల్నాడు జిల్లాలో కాక రేపుతోంది. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేట.. నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్ధి పేరు టిడిపి ఇంకా ప్రకటించలేదు. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే టికెట్ కేటాయించింది. టిడిపి ఇంఛార్జ్ గా అరవింద్ బాబు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో గోపిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ అరవింద్ బాబు గత ఐదేళ్లలో కష్టపడి పనిచేశారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆయనకే టికెట్ ఇస్తారన్న నమ్మకం లేదు. కొద్ది రోజుల క్రితమే టిడిపిలో చేరిన ఎంపి లావు శ్రీ క్రిష్ణదేవరాయలు ఎమ్మెల్సీ జంగా క్రిష్ణమూర్తిని టిడిపిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే జంగాకు నర్సరావుపేట టిడిపి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అరవింద్ బాబు పేరు ప్రకటించలేదని అంటున్నారు. దీంతో నర్సరావుపేటలోని తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. టిడిపి టికెట్ అరవింద బాబుకు ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు మనస్థాపానికి గురయ్యారు. మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ పులిమి రామిరెడ్డి ఆయన స్వగ్రామమైన పాలపాడులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ పార్టీ పదవులకు రాజీనామా చేస్తారేమో అని అనుకున్నారు. అయితే మీడియా సమావేశం ప్రారంభం కాగానే అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన రామిరెడ్డి ఆ తర్వాత అప్పటికే తెచ్చి పెట్టుకున్న పరుగు మందు డబ్బా తీసుకొని తాగేశారు. ఈ హఠాత్ పరిణామంపై విలేకర్లు ఆశ్చర్యపోయారు. ఆయన అభిమానులు వెంటనే రామిరెడ్డి అక్కడ నుండి బలవంతంగా తీసుకెళ్లారు. నర్సరావుపేటలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

తమ అభిమాన నాయకులకు టికెట్ ఇవ్వకపోతే బలవన్మరణాలకు పాల్పడటం ఆవేదనకు గురిచేస్తుంది. రాజకీయాల్లో టికెట్ రావడం రాకపోవడం సహజమని ఇటువంటి కార్యక్రమాలకు అభిమానులు పాల్పడకూడదని నేతలు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త