Purushottampatnam: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. ‘పురుషోత్తంపట్నం’ పిటిషన్‌ కొట్టివేత

సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను..

Purushottampatnam: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్.. 'పురుషోత్తంపట్నం' పిటిషన్‌ కొట్టివేత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 01, 2021 | 12:38 PM

Andhra Pradesh Govt: సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పర్యావరణ అనుమతులు పొందిన తరువాతనే దీనిపై ముందుకు వెళ్లాలని.. ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌) ను సమర్థిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని గతంలో ఎన్జీటీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అయితే పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీకొర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.

పురుషోత్తంపట్నం పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది వెంకటరమణి వాదనలు వినిపించారు. విశాఖ నగరం తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం తీరుస్తుందని.. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఎన్జీటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఆదేశాలు ఇచ్చిందని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

Also Read: