భర్త వెంటే భార్య.. తండ్రి వెంటే కొడుకు.. చివరకు ముగ్గురినీ కబళించిన మృత్యువు!

పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. భర్త ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య, కుమారుడు కూడా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

భర్త వెంటే భార్య.. తండ్రి వెంటే కొడుకు.. చివరకు ముగ్గురినీ కబళించిన మృత్యువు!
Family Tragedy
Image Credit source: AI Image

Updated on: Nov 27, 2026 | 10:00 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. భర్త ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య, కుమారుడు కూడా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

సీతానగరం మండలం ఆర్. వెంకంపేట సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను బొబ్బిలికి చెందిన చల్లపల్లి శ్రీను, ఆయన భార్య చల్లపల్లి సింహాచలం, కుమారుడు రాజేష్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. ఈ కుటుంబం బొబ్బిలి నుంచి సీతానగరం మండలం ఆర్. వెంకంపేటకు బయలుదేరింది. మార్గమధ్యంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న శ్రీను మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్ వైపు పరుగెత్తినట్లు తెలుస్తోంది.

భర్తను ప్రమాదం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో భార్య సింహాచలం, కుమారుడు రాజేష్ ఆయన వెనుకే వెళ్లారు. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో బొబ్బిలి, ఆర్. వెంకంపేట ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ వివాదాలు, ఆవేశపూరిత నిర్ణయాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us