AP News: వాళ్లు కూడా అప్టేట్ అయ్యారు గురూ.. గుప్త నిధుల కోసం మెటల్ డిటెక్టర్‌తో ఎంట్రీ.. కట్‌ చేస్తే..

ఆలయం వద్ద గుప్త నిధులు కోసం ఈ ఆరుగురు వచ్చినట్లు అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

AP News: వాళ్లు కూడా అప్టేట్ అయ్యారు గురూ.. గుప్త నిధుల కోసం మెటల్ డిటెక్టర్‌తో ఎంట్రీ.. కట్‌ చేస్తే..
Crime News
Follow us

|

Updated on: May 29, 2022 | 12:01 PM

Guntur Police: గుప్తనిధుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న ఘటన వెలుగు చూసింది. గతంలో గుప్త నిధుల ముఠాలు పురాతన కట్టడాలు, చారిత్రిక నేపథ్యం ఉన్న స్థలాలు, శిథిలావస్థలో ఉున్న దేవాలయాల వద్ద వివిధ మూఢనమ్మకాలతో తవ్వకాలు జరిపేవారు.. గుంటూరు జిల్లాలోని కొండవీడు కొండలు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన ఆలయాల్లో ఇటువంటి తవ్వకాలు ఎక్కువుగా జరిగేవి. అయితే.. అలాంటి తవ్వకాలు జరిపేవారు ఇప్పుడు అప్డేట్ అయ్యారు. గుప్త నిధుల కోసం ఏకంగా మెటల్ డిటెక్టర్ల (metal detector) తో రంగంలోకి దిగారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయితే రెండు రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులు ఈపూరు మండలం ఎర్రకుంట తండా సమీపంలో తచ్చాడుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ తండా సమీపంలో పురాతన మలిదేవమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం వద్ద గుప్త నిధులు కోసం ఈ ఆరుగురు వచ్చినట్లు అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద మెటల్ డిటెక్టర్ కూడా లభించడంతో పోలీసులు అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆరుగురు సభ్యుల ముఠాలో ముప్పాళ్ళకు చెందిన ఇద్దరు, ఈపూరుకు చెందిన ఇద్దరు, రాజమండ్రికి చెందిన ఇద్దరున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీరంతా గుప్తనిధుల కోసమే మలిదేవమ్మ ఆలయం వద్ద వెదుకులాట ప్రారంభించినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. వీరి వద్ద నున్న మెటల్ డిటెక్టర్ ద్వారా భూమిలో తొమ్మిదడుగుల లోతులో ఉన్న లోహాలను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పోలీసుల అనుమానాలు నిజం కావడంతో.. గతంలో ఎక్కడైనా తవ్వకాలు చేశారా..? ఎక్కడెక్కడ చేశారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

-టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Guntur

Guntur

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..