‘చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..

|

Apr 29, 2024 | 6:56 PM

చంద్రబాబు, ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డుతగలడంపై ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు.

చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది.. సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Sajjala Ramakrishna Reddy
Follow us on

చంద్రబాబు, ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డుతగలడంపై ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తప్పదని హెచ్చరించారు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షనర్లకు డబ్బులు అందకూడదనే చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. సీఎం జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్దులు నానా హైరానా పడ్డారని తెలిపారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుంది చంద్రబాబే అని ధ్వజమెత్తారు.

తన పాలనలో ఏనాడు పెన్షన్లు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్‎కు మాత్రమే ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రభుత్వం మీద వ్యవస్థల మీద చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడకలలు వస్తాయిని చురకలు అంటించారు. చంద్రబాబు బాధ్యత కల్గిన వ్యక్తిగా వ్యవహరించడం లేదన్నారు. ఈ దేశంలో ఉండే అర్హతను చంద్రబాబు కోల్పోయారన్నారు. గతంలో పెన్షన్ల పంపిణీ ఆపేందుకు చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు  సీఎం జగన్ పై , ప్రభుత్వ అధికారులపై దుష్ఫ్రచారం చేయిస్తున్నారన్నారు.

లైవ్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..