Andhra Pradesh: లారీ కింద సీక్రెట్ అర.. అనుమానంతో చెక్ చేయగా పోలీసులకు షాక్.!

లారీ ట్రాలీ కింద బ‌స్తాల్లో నింపిన గంజాయిని త‌ర‌లిస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మగ్లర్లను పోలీసులు ప‌ట్టుకున్న..

Andhra Pradesh: లారీ కింద సీక్రెట్ అర.. అనుమానంతో చెక్ చేయగా పోలీసులకు షాక్.!
Ganjai
Follow us

|

Updated on: Apr 30, 2022 | 2:01 PM

లారీ ట్రాలీ కింద బ‌స్తాల్లో నింపిన గంజాయిని త‌ర‌లిస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మగ్లర్లను పోలీసులు ప‌ట్టుకున్న ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో గంజాయి స్మగ్లర్లు లాంగ్ ట్రాలీ లారీని వినియోగించారు. లారీ ఓపెన్ టాప్ ట్రాలీలో ఓ ఇనుప వైర్ల లోడ్ పెట్టి స్మగ్లర్లు బ‌య‌లుదేర‌గా..అనుమానం వచ్చిన పోలీసులు ఆ లారీని ఆపి త‌నిఖీ చేశారు. ట్రాలీతో పాటు దాని కింది భాగాన్ని కూడా క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఈ క్రమంలో ట్రాలీకి, యాక్సిల్‌కు మ‌ధ్యలో ఉన్న ఇనుక క‌మ్మీల మీద గంజాయి బ‌స్తాలను గుర్తించారు. లారీ ట్రాలీని పైకి లేపి చూడ‌టంతో అక్కడ గంజాయి బ‌స్తాలు పెద్ద సంఖ్యలో క‌నిపించాయి. దీంతో గంజాయిని సీజ్ చేసిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పుష్ప రాజ్ నే మించిపోయార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

50c18f85 731e 4989 8ed3 B12aa0aea6b6

Capture