ఇదెక్కడి చిత్రం రా సామి.. మగపిల్లల సాకుతో వేధింపులు.. ఆ తల్లి ఏం చేసిందంటే?

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మగపిల్లలు పుట్టారని భర్త, అత్త వేధించడంతో కళ్యాణి అనే మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. తన ఇద్దరు కుమారులతో కలిసి వేదాద్రి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్రమత్తమైన చిలకల్లు పోలీసులు ఏఎస్సై మంగ్యానాయక్, కానిస్టేబుల్ అప్పలరాజు తక్షణమే స్పందించి వారి ప్రాణాలను కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదెక్కడి చిత్రం రా సామి.. మగపిల్లల సాకుతో వేధింపులు.. ఆ తల్లి ఏం చేసిందంటే?
Woman Harassed For Sons

Updated on: Sep 26, 2026 | 7:22 AM

ఎన్టీఆర్ జిల్లా: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాగా, విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు సకాలంలో స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.

జగ్గయ్యపేటకు చెందిన కళ్యాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇద్దరు మగపిల్లలు పుట్టారంటూ భర్త రామకృష్ణ, అత్త తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇద్దరు కుమారులకు జన్మనిచ్చినా ఏం ప్రయోజనం అంటూ భర్త, అత్త తరచూ మాటలతో వేధించేవారని తెలిపింది. భర్త తరచూ తనను కొడుతూ, అనుమానిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక కళ్యాణి గతంలో ఒకసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. విజయవాడలో చికిత్స పొందిన అనంతరం ప్రాణాలతో బయటపడింది. అయినప్పటికీ ఇంట్లో పరిస్థితుల్లో మార్పు రాలేదని చెబుతోంది.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి.. తన ఇద్దరు చిన్నారులను తీసుకుని వేదాద్రి వద్ద కృష్ణానది తీరానికి చేరుకుంది. నదిలోకి దూకేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న చిలకల్లు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏఎస్సై మంగ్యానాయక్, ఏఆర్ కానిస్టేబుల్ అప్పలరాజు వెంటనే స్పందించి కళ్యాణిని, ఇద్దరు పిల్లలను అడ్డుకుని కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి కళ్యాణిని ఆమె తల్లి వద్దకు అప్పగించారు. సకాలంలో స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడిన పోలీసుల చొరవపై స్థానికులు అభినందనలు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us