AP Rains: భారీ వర్షాల నుంచి తేరుకున్న అనంతపురం జిల్లా.. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మత్తులు..

ఏపీలోని అనంతపురం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయి. కేవలం నాలుగు రోజులు కురిసిన వర్షం.. జిల్లాను అతలాకుతలం చేసింది...

AP Rains: భారీ వర్షాల నుంచి తేరుకున్న అనంతపురం జిల్లా.. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న మరమ్మత్తులు..
Ananthapuram
Follow us

|

Updated on: Nov 24, 2021 | 9:52 AM

ఏపీలోని అనంతపురం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయి. కేవలం నాలుగు రోజులు కురిసిన వర్షం.. జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాలో ఉన్న పిల్ల కాలువ దగ్గర నుంచి వాగులు, వంకలు.. పొంగిపొర్లాయి. భూగర్భజలాలు పెరిగాయి. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో చేపల జాతర సాగుతోంది. గతంలో చుక్క నీటి కోసం అల్లాడిపోయిన ప్రాంతాల్లో భారీ నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహాల్లో పెద్ద ఎత్తున చేపలు కనిపిస్తుండటంతో జనం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టన్నుల కొద్దీ చేపలను రోడ్లలో పడుతున్నారు. చెరువులు, వంకల వద్ద చేపలు పట్టేందుకు భారీగా జనం వస్తున్నారు. శింగనమల చెరువు దగ్గరకి.. వందల సంఖ్యలో జనం వచ్చి చేపలు పడుతున్నారు. రోడ్లు తెగిన చోట అధికారులు మరమ్మత్తులకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే.. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బుధవారం నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాలపైన ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ద్రోణి విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Read Also.. Etikoppaka Toys: బొమ్మల తయారీతో 200 మందికి ఉపాధి మార్గం చూపిన రాజు.. ప్రధాని మోడీ ప్రశంసలు ఎలా పొందారో తెలుసుకోండి!