దారుణం.. కన్న కొడుకును చిత్ర హింసలకు గురిచేసిన తల్లి.. భర్తపై కోపంతో చిన్న పిల్లాడని చూడకుండా..

|

Aug 29, 2021 | 10:47 AM

Mother Tortures Her Son: నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకును ఓ తల్లి అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసింది.

దారుణం.. కన్న కొడుకును చిత్ర హింసలకు గురిచేసిన తల్లి.. భర్తపై కోపంతో చిన్న పిల్లాడని చూడకుండా..
Mother Tortures
Follow us on

Mother Tortures Her Son: నవ మాసాలు మోసి కని పెంచిన కొడుకును ఓ తల్లి అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురిచేసింది. భర్తపై కోపంతో ఇష్టమొచ్చినట్లు కొడుతూ సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేస్తూ రాక్షసానందం పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన తల్లి కొడుకుల బంధానికి మాయని మచ్చలా మిగిలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విల్లుపురం జిల్లా సెంజీకి చెందిన వడివళగన్, తులసి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు.

తులసి సొంతవూరు ఆంధ్రలోని చిత్తూరు. గత కొంతకాలంగా భర్తతో విభేదాలు రావడంతో పిల్లలను వదిలేసి తల్లిదండ్రులతో ఉంటుంది. అయితే పిల్లల ఒంటిపై గాయాలు కనిపించడంతో భర్తకి అనుమానం వచ్చింది. తులసి ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌ని పరిశీలించగా అసలు నిజాలు బయటికి వచ్చాయి. చిన్నకొడుకు ప్రదీప్‌ని తులసి విచక్షణారహితంగా చిత్రహింసలు పెడుతున్న వీడియోలు కనిపించాయి. దీంతో తులసిని నిలదీశాడు. వడివళగన్‌పై ఉన్న కోపంతో పిల్లలని కొట్టినట్టు తులసి ఒప్పుకుంది. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో తులసిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే తులసి సెల్‌ఫోన్‌లో పిల్లాడిని కొడుతున్న వీడియోలు అత్యంత దారుణంగా ఉన్నాయి. వీటిని చూసిన నెటిజన్లు తులసిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాడి ఒంటిపై మొత్తం వాతలు ఉన్నాయి. అతడి నోటిపై ఇష్టమొచ్చినట్లు కొడుతుంది. దీంతో పెదవులు పగిలి పిల్లాడు బోరున విలపిస్తాడు. అయినా కోపం తగ్గని తులసి పిడికిలితో కొడుకు కాలుపై బలంగా కొడుతుంది. వీడియోలో పిల్లాడి రోదన చూస్తే అసలు ఈమె తల్లేనా అనే ప్రశ్న అందరికి వస్తోంది. అత్యంత పాశవికంగా వ్యవహరించిన తులసిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Cat Rescue: మానవత్వం పరిమళించినవేళ.. పిల్లిని పట్టారు.. రాజుగారి ప్రశంసలతో పాటు.. పదిలక్షల రివార్డును అందుకున్నారు

Krishnashtami 2021: కృష్ణాష్టమిరోజున కన్నయ్యకు ఇష్టమైన పదార్ధాలతో నైవేద్య పెట్టండి.. కృపకు పాత్రులుకండి

India Corona Cases: భారత్‌లో టెన్షన్ పెడుతున్న కొత్త కేసులు, మరణాలు.. తాజా వివరాలు ఇలా