Minister Kakani: ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఇప్పటి నుంచే మొదలైంది. అధికార ప్రతి ప్రక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. వైసీపీ నేతలు, జనసేన నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యవసాయం గురించి నటుడు పవన్ కళ్యాణ్, మహా నటుడు చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని.. అసలు వ్యవసాయం గురించి ఏమి తెలియని వ్యక్తి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ చదవడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం పరిస్థితుల గురించి తెలిస్తే పవన్ కళ్యాణ్ కి మాటలు రావని చెప్పారు. చంద్రబాబు హయాంలో వందలాది కరవు మండలాలు ప్రకటించిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు రైతులకు ఏమి చేశారో అసలు పవన్ కళ్యాణ్ చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు గోవర్ధన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 23,875 కోట్ల రైతు భరోసా ఇచ్చామని.. 15 వందల కోట్ల రూపాయలను రుణ మాఫీ చేశామని చెప్పారు. అసలు చంద్రబాబు రైతులకు ఏ విధమైన భరోసా ఇవ్వలేదని చెప్పారు మంత్రి గోవర్ధన్ రెడ్డి.
అంతేకాదు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడుతూ.. చెప్పిన మూడు అప్షన్ల పై కాకాని ఎద్దేవా చేశారు. ఏంటి మూడు అప్షన్లు.. ఎవరికి ఇస్తావు అప్షన్లు.. చంద్రబాబుతో అంట కాగడం తప్ప ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అసలు రాష్ట్రంలో పార్టీ పెట్టి ఎమ్మెల్యే గా కూడా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అంటే ఎందుకో లవ్ ఎక్కువైందని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..