తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి.. ప్రస్తుతం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ధర్మారెడ్డి వియ్యంకులు కాబోతున్నారు. ధర్మారెడ్డి తనయుడు,శేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం జూన్ 9న తిరుమల(Tirumala)లో నిరాడంబరంగా జరిగింది. బంధుమిత్రులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కాగా శేఖర్ రెడ్డి కూడా గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా పనిచేశారు. ప్రుస్తుతం ఆయన చెన్నైలోని TTD బోర్డు స్థానిక సలహా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. తిరుమల వెంకన్న సన్నిధికి దగ్గరిగా ఉండే రెండు కుటుంబాలు ఇప్పుడు వివాహా బంధంలో ఒక్కటి కాబోతున్నాయి.
TTD ఈవోగా కొనసాగనున్న ధర్మారెడ్డి
కాగా TTD ఈవోగా ధర్మారెడ్డి కొనసాగనున్నారు. ఆయన మరో రెండేళ్లు ఏపీలో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి అయిన ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. మే 14తో ధర్మారెడ్డి ఏడేళ్ల డిప్యుటేషన్ కాలం ముగిసింది. దీంతో ఆయన డిప్యుటేషన్‌పై కొన్ని రోజలు పాటు సస్పెన్స్ నడిచింది. ఆయన కొనసాగింపు కోసం జగన్ సర్కార్ కేంద్రానికి రిక్వెస్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్రం ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులో కొనసాగించేందుకు పర్మిషన్ ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. కాగా గతంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా, అదనపు కార్యనిర్వహణాధికారిగా ధర్మారెడ్డి పనిచేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి