Andhra Pradesh: రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా బడ్జెట్ లో నిర్ణయాలు.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,సూచనలను పరిగణలోకి తీసుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు..

Andhra Pradesh: రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా బడ్జెట్ లో నిర్ణయాలు.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..
Buggana Rajendranath
Follow us

|

Updated on: Feb 01, 2023 | 5:13 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సలహాలు,సూచనలను పరిగణలోకి తీసుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పంప్ స్టోరేజ్ విధానం అమలులో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా ఉందన్న ఆయన.. దీనిపై పాలసీ తేవాలని కోరామని, అందుకు తగినట్లు కేంద్రం పాలసీని ప్రకటించిందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచాలన్న ఏపీ విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించారనన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఏపీ ప్రతిపాదనను పరిగణించి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం గర్వకారణమని కొనియాడారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయన్న బుగ్గన.. నర్సింగ్ కాలేజీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఎయిర్‌ పోర్టులు, పోర్టులు నిర్మాణం, గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి బడ్జెట్ తోడ్పాటు అందించిందని చెప్పారు.

వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించి ఎరువులలో రూ.50 వేల కోట్లు కేటాయింపు తగ్గింది. రోడ్లు రవాణాలో పెరుగుదల నమోదైంది. గ్రామాల్లో పనికి ఆహార పథకం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు తగ్గాయి. జల్ జీవన్ మిషన్‌లో రూ.15వేల కోట్లు పెరిగాయి. పీఎం ఆవాస్ యోజన పథకానికి 66 శాతం నిధులు పెరిగాయి. ఎయిర్ పోర్టులు, పోర్టులు, హెలీపాడ్‌లు పెట్టడం వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది. గతేడాది రూ.41.87 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర బడ్జెట్ రూ. 3.13 లక్షల కోట్లకు పెరిగింది. 2023-24కి గానూ రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొవి కారణంగా గతేడాది 6.4 శాతం ద్రవ్యలోటు ఉండగా.. ఇప్పుడది 5.9 శాతంగా తగ్గడం మంచి పరిణామం. పన్ను ద్వారా వచ్చిన ఆదాయం ప్రస్తుతం రూ. 33.60 లక్షల కోట్లుగా అంచనా. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా గతేడాది 9.15వేల కోట్లు. ఈ ఏడాది రూ.10లక్షల కోట్లుగా ఉందని అంచనా.

– బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థికశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

విద్య, విద్యుత్, రోడ్లు, రవాణా రంగాలకు ప్రాధాన్యత పెరిగిందన్న మంత్రి.. గతేడాది రూ.1.89 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి రూ.2 లక్షల కోట్లకు పైగా కేటాయించారని చెప్పారు. ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లు ఊరటనిచ్చాయని వివరించారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, యూరియా, బియ్యం, గోధుమలకు నిధుల కేటాయింపు తగ్గిందన్నారు. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు , రైల్వే సదుపాయాలు, రహదారులకు సంబంధించి నిధులు పెరగడం సంతోషం అని కొనియాడారు. సప్తరుషులు పేరుతో 7 ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యతనిచ్చే నేపథ్యంతో 2023-24 కేంద్ర బడ్జెట్ రూపకల్పన పాలన వికేంద్రీకరణ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం విధానమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..