Malladi Krishna Rao: కోనసీమ జిల్లా(Konaseema District) పేరు మార్పుపై పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ (Dhili)అధికార ప్రతినిధి.. టిటిడి(TTD) బోర్డ్ సభ్యులు మల్లాడి కృష్ణారావు స్పందించారు. కోనసీమ జిల్లా కి డాక్టర్. బి ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టడం హర్షణీయమని చెప్పారు. అయితే ఈ పేరుకు ముందు భారతరత్న పేరు జతపరిస్తే బాగుటుందని ఓ సూచన కూడా చేశారు. అంతేకాదు కాకినాడ జిల్లాకు కొన్ని లక్షల ప్రజలకు స్ఫూర్తి ప్రదాత మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పెట్టాలని సీఎం జగన్ ని కోరినట్లు చెప్పారు. తన ప్రతిపాదన వెంటనే కార్యరూపం దాల్చుతుంది అని ఆశిస్తున్నానని అన్నారు.
మరోవైపు బి. సి. నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించడం పట్ల సంతోషిస్తున్నానని చెప్పారు మల్లాడి కృష్ణారావు. ఏడాదిలో యానాం అభివృద్ధి చెందిందని అన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పగటి పూట యానాం ఎమ్మెల్స్యే.. రాత్రి కాకినాడ నివాసి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయ పార్టీలకు పొత్తులు అనేవి సహజమని చెప్పారు. అయితే చంద్రబాబు వ్యక్తిగత కారణాలతోనే ఓడిపోయారని చెప్పారు. ఎవరైనా సరే అభివృద్ధి చేయక కాదు.. బలం లేకపోతే పొత్తులకు వెళతారంటూ సంచలన కామెంట్స్ చేశారు మల్లాడి. సంక్షేమ పథకాలు, ప్రజలపై దృష్టి సారించకపోతే వారిని ప్రజలు పక్కన పెట్టేస్తారని చెప్పారు మల్లాడి కృష్ణారావు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..