కిక్ బాక్సింగ్ లెవల్లో మందుబాబుల ఫైట్

విశాఖలో మందుబాబులు వీరంగం చేశారు. స్థానిక వేలంపేట ఏరియాలో నడిరోడ్డుపై కిక్ బాక్సింగ్ తరహాలో ఒకర్నొకరు కొట్టుకున్నారు. ఈస్ట్రీట్ రౌడీల స్ట్రీట్ ఫైట్ చూసేందుకు స్థానికులు కూడా ఎగబడ్డారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. చొక్కాలు విప్పుకున్న ప్రొఫెషనల్స్ బాక్సర్లలా బిల్డప్ ఇస్తూ కొట్టుకున్నారు. తాగుబోతులు ఇద్దరు పూటుగా తాగారు. ఇక చొక్కాలు విప్పుకుని బాహాబాహీకి దిగారు. రోడ్డుపై కండలు ప్రదర్శిస్తూ కలబడ్డారు. ముఖాలు పచ్చడయ్యేలా ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వాళ్లిద్దరి ఫైట్ […]

కిక్ బాక్సింగ్ లెవల్లో మందుబాబుల ఫైట్
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2019 | 10:41 AM

విశాఖలో మందుబాబులు వీరంగం చేశారు. స్థానిక వేలంపేట ఏరియాలో నడిరోడ్డుపై కిక్ బాక్సింగ్ తరహాలో ఒకర్నొకరు కొట్టుకున్నారు. ఈస్ట్రీట్ రౌడీల స్ట్రీట్ ఫైట్ చూసేందుకు స్థానికులు కూడా ఎగబడ్డారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. చొక్కాలు విప్పుకున్న ప్రొఫెషనల్స్ బాక్సర్లలా బిల్డప్ ఇస్తూ కొట్టుకున్నారు. తాగుబోతులు ఇద్దరు పూటుగా తాగారు. ఇక చొక్కాలు విప్పుకుని బాహాబాహీకి దిగారు. రోడ్డుపై కండలు ప్రదర్శిస్తూ కలబడ్డారు. ముఖాలు పచ్చడయ్యేలా ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వాళ్లిద్దరి ఫైట్ ను అక్కడున్నవారు కళ్లప్పగించి చూస్తూ ఎంజాయ్ చేశారు.

దాదాపు అరగంట సేపు సాగిందీ ఫైటింగ్ తంతు. ఫైటింగ్ సాగే కొద్దీ పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేకపోవడంతో.. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే రౌడీలను అదుపులోకి తీసుకోవడంతో ఈ స్ట్రీట్ ఫైట్‌కు ఎండ్ కార్డ్ పడింది.

Latest Articles