Nagababu Vs Rambabu: పేలుతున్న పంచ్‌లు, ప్రాసలు.. ట్విట్టర్ వేదికగా వేడెక్కిన ఏపీ రాజకీయం

నాగబాబు, రాంబాబు మధ్య జరుగుతున్న ట్విట్టర్‌ యుద్ధం చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఈ వివాదానికి మూలం చేనేత చాలెంజ్‌. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం పదండి.

Nagababu Vs Rambabu: పేలుతున్న పంచ్‌లు, ప్రాసలు.. ట్విట్టర్ వేదికగా వేడెక్కిన ఏపీ రాజకీయం
Ambati Vs Nagababu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:41 PM

AP Politics: సోషల్ మీడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీ పొలిటికల్ హీట్ పెరిగింది.  పవన్‌కల్యాణ్‌ 175 స్థానాల్లో పోటీ చేస్తారా లేదా అంటూ సెటైర్ వేశారు మంత్రి రాంబాబు.  రాంబాబు ప్రశ్నకు మార్ఫింగ్ ఫోటోతో ఆన్సర్ ఇచ్చిన నాగబాబు. బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు అంటూ అంబటి రీట్వీట్‌ చేశారు. ఇదీ మ్యాటర్‌. నాగబాబు, రాంబాబు మధ్య జరుగుతున్న ట్విట్టర్‌ యుద్ధమిది. చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. ఈ వివాదానికి మూలం చేనేత చాలెంజ్‌. చేనేత వస్త్రం ధరించి ఫోటో పోస్ట్ చేయాలంటూ కేటీఆర్‌(Minister KTR).. పవన్ కల్యాణ్‌కు చాలెంజ్ విసిరితే, దాన్ని స్వీకరించి అదే చాలెంజ్‌ను పవన్‌(Pawan kalyan).. చంద్రబాబు(Chandrababu) సహా మరో ఇద్దరికి విసిరారు. అంతవరకూ ఒక ఎత్తయితే దాన్ని అంబటి అందిపుచ్చుకుని పవన్ కల్యాణ్‌ ముందు ఓ ప్రశ్న ఉంచడంతో వివాదం మొదలైంది. ఈ వివాదంలో ఫస్ట్ ట్వీట్‌ అంబటి నుంచి పేలింది. పవన్ కల్యాణ్ గారూ.. కాటన్ దుస్తులు చాలెంజ్ ఆపి ఇంతకీ 175 సీట్లలో పోటీ చేస్తున్నారా లేదా, ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి అంటూ మొదలుపెట్టారాయన.

అంబటి సెటైర్‌కి ఊహించని రేంజ్‌ రీట్వీట్ చేశారు జనసేన నేత నాగబాబు. ఒకే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు రాంబాబూ అంటూ అందుకున్నారు. నీ లాంటి వ్యక్తికి సమాధానం ఇచ్చే తీరిక జనసైనికులకు గానీ, పవన్ కల్యాణ్‌కు గానీ అస్సలు లేదన్నారు. ఆ మాటతో ఆగారా అంటే అంబటి ఫోటోను మార్ఫింగ్ చేశారు.. !.

పోస్ట్‌కు పోస్ట్‌, సెటైర్‌కి సెటైర్‌లు సీరియల్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో నెక్ట్స్ అంబటి వంతు వచ్చింది. ఈసారి ఆయన అదే ఫోటోను రీట్వీట్ చేస్తూ .. భలేవారండీ నాగబాబుగారు, ఎంత ఓపికగా, ఎంత తీరికగా నా బొమ్మ వేశారండీ. ఖాళీగా ఉన్నట్టున్నారు.. థ్యాంక్స్ అంటూ ముక్తాయించారు. లేదంటూనే నాగబాబు ఖాళీగా ఉన్నరంటూ వ్యంగ్యంగా అంబటి చేసిన పోస్ట్‌కి మళ్లీ జనసేన నుంచి గానీ, నాగబాబు నుంచి గానీ రీట్వీట్ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..