Viral Video: జామతోటల మధ్య రామచిలుకల సందడి.. పెళ్లి సందడి సాంగ్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

Viral Video: మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే.. మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే... నిను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని..

Viral Video: జామతోటల మధ్య రామచిలుకల సందడి.. పెళ్లి సందడి సాంగ్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు
Love Birds

Updated on: Oct 17, 2021 | 7:06 PM

Viral Video: మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే.. మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే… నిను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని.. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ పెళ్లిసందడి సినిమాలో జామతోటల మధ్య రామచిలుకల సందడి ..దర్శకుడు రాఘవేంద్రరావు క్రియేట్ చేసిన విజువల్స్.. వేటూరి రాసిన పాట చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే.. మరి అవే దృశ్యాలు నిజ జీవితంలో కనిపిస్తే ఆహా ఆ ఫీలింగ్ గురించి.. అప్పుడు కలిగే ఆనందం.. ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలే.. అలాంటి దృశ్యాన్ని చూస్తూ అనుభూతి చెందాల్సిందే.. తాజాగాన కోనసీమలోని అంబాజీపేటలో అటువంటి దృశ్యం కనివిందు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

అంబాజీపేటలోని ఒక చోట జామచెట్టుపై రెండు రామ చిలుకలు ఆడ చిలుక, మగ చిలుక ప్రేమగా.. కిచ కిచమంటూ జమకాయలను కోరుక్కు తింటుంన్నాయి. ఆ దృశ్యాన్ని చూసి కొందరు తమ కెమోరాకు పనిచెప్పారు. రామ చిలుకల జామకాయ తింటున్న సమయంలో వీడియో తీశారు. ఈ జంట పక్షులను చూసేందుకు రెండు కళ్ళు చాలవు అనిపించడం ఖాయం ఎవరికైనా.. అందుకేనేమో ఇంత అందంగా ఉంటుందని ఇలా జమాతోటల మధ్య తీసిన ఆ పాట ఇప్పటికే ఎవర్ గ్రీన్ గా నిలిచింది.

Also Read: నాకు అడుక్కోవాలని లేదు.. జీవించడం కోసం పెన్నులు అమ్ముతున్నా ఒక్కటి కొన్నా చాలు అంటున్న 80 ఏళ్ల బామ్మ..

Loading...
Unable to load recommendations.
Follow Us