AP News: దేవుడు కలలో కనిపించాడని చెప్పిన బాలుడు.. తెల్లారి పొలంలో వెతికి చూడగా

| Edited By: Ravi Kiran

Jul 08, 2024 | 9:59 AM

మొహర్రం పండుగ వేళ ఓ బాలుడు చేసిన వింత ప్రకటన ఊర్లకు ఊర్లు కదిలి వచ్చాయి. 'నాకు దేవుడు కనిపిస్తున్నాడు. ఆ పీర్లస్వామి మన ఊర్లోనే ఉన్నాడు. రండి చూపిస్తానంటూ..' 12 ఏళ్ల బాలుడు చేసిన ప్రకటనతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కదిలి వచ్చారు. పొలాలన్నీ వెతికారు.

AP News: దేవుడు కలలో కనిపించాడని చెప్పిన బాలుడు.. తెల్లారి పొలంలో వెతికి చూడగా
Ap News
Follow us on

మొహర్రం పండుగ వేళ ఓ బాలుడు చేసిన వింత ప్రకటన ఊర్లకు ఊర్లు కదిలి వచ్చాయి. ‘నాకు దేవుడు కనిపిస్తున్నాడు. ఆ పీర్లస్వామి మన ఊర్లోనే ఉన్నాడు. రండి చూపిస్తానంటూ..’ 12 ఏళ్ల బాలుడు చేసిన ప్రకటనతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కదిలి వచ్చారు. పొలాలన్నీ వెతికారు. చివరకు ఆ బాలుడు చేసింది.. చెప్పింది.. నిజం కాకపోవచ్చని.. అసత్య ప్రచారమని నిర్ధారించుకున్న ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని గురయ్యారు.

వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురువల్లి గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడికి పూనకం వచ్చింది. పీర్ల స్వాముల్ని కూర్చోబెట్టే మసీదు వద్ద గుంత తీసే విషయంలో బాలుడికి ఉన్నట్లుండి పూనకం వచ్చింది. ప్రత్యేక ఐదు ఫీర్లను మాత్రమే కూర్చోబెడుతున్నారు. మొత్తం ఆరుగురు పీర్ల స్వాములు ఉన్నారు. ఈసారి ఆరవ పీర్లస్వామిని కూర్చోబెట్టకపోతే అరెస్టు తప్పదంటూ ఆ పూనకంలో హెచ్చరించాడు. ఆ ఆరవ పీర్ల స్వామి ఎక్కడ ఉన్నాడంటూ బాలుడిని గ్రామస్తులు ప్రశ్నించారు. మన ఊరు పొలాల్లోనే ఉన్నాడు.. రండి.! పోయి వెతికి తీసుకుని వద్దామని హితబోధ చేసినట్లు చెప్పడంతో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కదిలి వచ్చారు. బాలుడితో కలిసి పొలాలన్నీ కలియ తిరిగారు. 24 గంటల పాటు వేలాదిమంది వెతికారు.

చివరకు ఓ చోట భూమి లోపల నుంచి ఇనుప రేకుతో తయారైన పీరును పోలిన ప్రతిమ కనబడడంతో ఇదే ఆరవ పీర్ల స్వామి అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ బొమ్మ కొత్తదిగా ఉండటం చూసిన గ్రామస్తులు ఇది ముందస్తు పథకం ప్రకారం నమ్మించేందుకు చేసిన ప్రయత్నం అని జనమంతా ఆగ్రహించారు. చిన్నగా ఆ బాలుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రజల ముందు చుట్టుపక్కల గ్రామాలలో తాను దేవుడిగా మలుచుకునే ప్రయత్నమే ఈ తతంగమంతా అని ప్రజలంతా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అయితే ఈలోపే బాలుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. మొహర్రం పండుగ సందర్భంగా జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పట్టాలపై ఎద్దుల భీకర ఫైట్.. అంతలో దూసుకొచ్చిన రైలు.. ఆ తర్వాత ఇది సీన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..