Andhra Pradesh: ఏపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు..

|

Dec 10, 2022 | 7:59 AM

ఆంధ్రప్రదేశ్‌ నూతన పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు ఇతర కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు,..

Andhra Pradesh: ఏపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గిడుగు రుద్రరాజు..
Gidugu Rudraraju
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ నూతన పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు ఇతర కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు, ఎఐసిసి కార్యదర్శులు క్రిస్టోఫర్ తిలక్, మయప్పన్, పార్టి సీనియర్ నేతలు హాజరయ్యారు. కాగా, ఏపీసీసీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుని సత్కరించారు తెలంగాణ కాంగ్రెస్‌ ఎల్పీ నేత భట్టి విక్రమార్క.

మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు భట్టి. రాష్ట్ర వ్యవహారాల్లో రుద్రరాజు బాగా పని చేస్తారని భావిస్తున్నానన్నారు. వైయస్సార్, కేవిపి రామచంద్రరావు తమను అనేక సందర్భాల్లో మార్గదర్శకం చేశారని.. ఇప్పుడు మనం అదే బాటలో వెళ్తూ కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నారు భట్టి. వంగవీటి మోహన రంగాను అందరూ గుర్తు చేసుకోవాలని ఈ ప్రాంతంలో రంగా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పని చేశారన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్పూర్తి తో నాయకులు ప్రజల్లోకి వెళ్లాలన్నారు భట్టి. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార సభ లో తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలగించి మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఇన్చార్జి ఇవ్వడంపై మనస్థాపం చెందారు. మీడియా కోఆర్డినేషన్ పదవిని యువతకు ఇవ్వాలని సూచించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఇటువంటి పదవి అక్కర్లేదన్నారు తులసి రెడ్డి. మరోవైపు రుద్రరాజుని కలిసి అభినందనలు తెలిపారు అమరావతి రైతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..