Covid In AP Schools: ఏపీ స్కూల్స్‌లో కరోనా వైరస్ కలకలం.. తాజాగా కృష్ణ జిల్లాలో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Corona Virus In AP Schools: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. స్కూల్ పునఃప్రారంభించిన కొన్ని రోజులకే పలు పాఠశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి..

Covid In AP Schools: ఏపీ స్కూల్స్‌లో కరోనా వైరస్ కలకలం.. తాజాగా కృష్ణ జిల్లాలో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
Ap Schools

Updated on: Sep 03, 2021 | 8:35 AM

Corona Virus In AP Schools: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం పాఠశాల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. స్కూల్ పునఃప్రారంభించిన కొన్ని రోజులకే పలు పాఠశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో పలు పాఠశాల్లో విద్యార్థులు , ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడడంతో కొన్ని స్కూల్స్ ను తాత్కలికంగా మూసివేశారు. శానిటైజేషన్ చేస్తున్నారు.  తాజా కృష్ణా జిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు,సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా  నిర్ధారణ అయింది. బాధిత విద్యార్ధులందరూ మండల కేంద్రమైన ముసునూరుకు చెందినవారు. కరోనా బాధితులకు ప్రభుత్వ వైద్యులు చికిత్సనందిస్తున్నారు. మెడికల్ కిట్లు అందజేసి హోమ్ ఐసోలేషన్ లో  పెట్టి చికిత్స చేస్తున్నారు. ఇక స్కూల్ మొత్తం శానిటైజ్ చేసి.. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. అంతేకాదు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులను స్కూలుకు పంపేందుకు సంకోచిస్తున్నారు.

పలు పాఠశాలల్లో కరోనా సోకడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. ఏదైనా స్కూల్లో ఒకేరోజు ఐదుగురికి మించి విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఆ స్కూల్ ను మూసేయాలని స్పష్టం చేసింది. మిగిలిన విద్యార్థులకు 14 రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత మాత్రమే క్లాసులు నిర్వహించాలని సూచించింది.

Also Read:

కాఫీ ధర రూ. 250, రెండు ఇడ్లీలు మాత్రం రూ. 3.50.. ఆసక్తికరమైన ట్వీట్‌ చేసిన హర్షగోయెంకా.

: బిగ్ బాస్ బిగ్ డెసిషన్ …. షాక్ లో కంటెస్టెంట్లు లైవ్ వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us