భార్య, భర్త.. ఓ పరిచయస్తుడు.. కట్ చేస్తే.. కేసు, కోర్టు, విడాకులు.. ఏం జరిగిందంటే..

| Edited By: Srikar T

Feb 13, 2024 | 12:59 PM

చిత్తూరు జిల్లా నగరిలో భార్య వివాహేతర సంబంధం భర్తను హంతకున్ని చేసింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడాన్ని కళ్లారా చూసిన భర్త తప్పనివారించారు. భార్యపై ఉన్న మమకారంతో మారాలని కోరాడు. అయితే భర్త కన్నా ఎక్కువగా ఇష్టపడే ప్రియుడిని వదులుకోలేక పోయింది భార్య. ఇంకేం ఉంది భార్యాభర్తల బంధంలో తలదూర్చిన వ్యక్తిని కడతేర్చాడు.

భార్య, భర్త.. ఓ పరిచయస్తుడు.. కట్ చేస్తే.. కేసు, కోర్టు, విడాకులు.. ఏం జరిగిందంటే..
Crime At Nagari
Follow us on

చిత్తూరు జిల్లా నగరిలో భార్య వివాహేతర సంబంధం భర్తను హంతకున్ని చేసింది. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడాన్ని కళ్లారా చూసిన భర్త తప్పనివారించారు. భార్యపై ఉన్న మమకారంతో మారాలని కోరాడు. అయితే భర్త కన్నా ఎక్కువగా ఇష్టపడే ప్రియుడిని వదులుకోలేక పోయింది భార్య. ఇంకేం ఉంది భార్యాభర్తల బంధంలో తలదూర్చిన వ్యక్తిని కడతేర్చాడు. ఈనెల 3న నగిరి మండలం నెత్తంగ్రామంలో హత్య చోటుచేసుకుంది. లక్ష్మీపురంకు చెందిన ఎం జగదీష్ ఈనెల హత్యకు గురికాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. జగదీష్ హత్యను ఛేదించిన నగరి పోలీసులు సూత్రధారి సుధాకర్‎తోపాటు సహకరించిన 7 మందిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు.

నగిరి మండలం నెత్తం గ్రామం లక్ష్మీపురంలో సుధాకర్ ఇంటి పైభాగంలో ఎం జగదీష్ బాడుగకు చేరాడు. సుధాకర్ కుటుంబ సభ్యులతో జగదీష్‎కు పరిచయం ఏర్పడింది. వ్యాపార పనుల్లో బయట తిరిగే సుధాకర్ స్థానికంగా లేని సమయంలో సుధాకర్ భార్యతో జగదీష్‎కు చనువు పెరిగింది. అలా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ భార్యను వారించాడు. తప్పని చెప్పే ప్రయత్నం చేశారు. వినకపోతే ఏకంగా గ్రామంలో పెద్ద మనుషులతో పంచాయతీ కూడా పెట్టించారు. అయినా భార్య జగదీష్‎తో ఉన్న బంధాన్ని తెంపుకోలేక పోయింది. ఇక భార్యపై ఉన్న మమకారంతో ఇదంతటికీ కారణం జగదీష్ అనుకున్నాడు. ఆగని భార్య తీరుతో మదనపడ్డ సుధాకర్‎కు కోర్టు నుంచి విడాకులు కోరుతూ భార్య నోటీసులు పంపింది. దీంతో సుధాకర్‎కు జగదీష్‎పైన కసి పెరిగింది.

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన జగదీష్‎ను చంపాలనుకున్నాడు. తమ్ముడు మురళితో పక్కా ప్లాన్ చేసాడు. రూ. 10లక్షలకు తమిళనాడు గ్యాంగ్‎కు సుపారి ఇచ్చాడు. ఈ మేరకు జనవరి 27న ఉదయం జగదీష్‎పై ఇద్దరు దాడి చేశారు. తప్పించుకున్న జగదీష్‎ను ఈనెల 3న రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు కత్తితో పొడిచి చంపి పారిపోయారు. జనవరి 27 ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, సుధాకర్ పని చేయించాడన్న అనుమానంతో నగరి పోలీస్ స్టేషన్‎లో జగదీష్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 3న జరిగిన జగదీష్ హత్యను ఛేదించారు. జగదీశ్ హత్యలో ప్రధాన నిందితుడు సుధాకర్‎గా తేల్చిన పోలీసులు గుండ్రాకు కుప్పం వద్ద అరెస్ట్ చేశారు. సుధాకర్ ఇంట్లో జగదీష్ హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సుధాకర్ తమ్ముడు మురళి, సఫారీ గ్యాంగ్ లోని 6 మందిని అరెస్టు చేశారు. సుధాకర్‎తోపాటు మురళి, తమిళనాడుకు చెందిన సఫారీ గ్యాంగ్ ఎస్ నగేష్, ఏ అజిత్ రాజి, హరిహరన్ కుమార్, సిటీ సూరి, రాజా ముత్తు, జయశంకర్ బాలాజీలను కోర్టులో హాజరు పరిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..