AP Rains: ఏపీలో ఇకపై వర్షాలు ఆగినట్లేనా.? తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Sep 19, 2024 | 1:51 PM

ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు.

AP Rains: ఏపీలో ఇకపై వర్షాలు ఆగినట్లేనా.? తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
Ap Rains
Follow us on

ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి.

ఇది చదవండి: అమ్మబాబోయ్.! ఇంటి ప్రహరీ గోడకు పెద్ద కన్నం.. కనిపించింది చూడగా కళ్లు తేలేశాడు

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
——————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————

ఈరోజు, రేపు:-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము/ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
—————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము/ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-
——————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇది చదవండి: 16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం.. టీ20ల్లో అరుదైన రికార్డు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..