Cyber Fraud: ఫోన్‌లోనే సంప్రదింపులు.. ఆన్‌లైన్‌లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ మనీ యాప్ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు DAAI యాప్ పేర కొత్త మోసానికి తెర తీశారు. రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000 చొప్పున 25 రోజుల పాటు రూ 25 వేలు తిరిగి ఖాతాలకు జమ చేస్తామంటూ జనానికి ఆశ చూపారు. తీర డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేశారు.

Cyber Fraud: ఫోన్‌లోనే సంప్రదింపులు.. ఆన్‌లైన్‌లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!
Online Fraud
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 26, 2024 | 2:03 PM

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ మనీ యాప్ పేరుతో రూ. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు DAAI యాప్ పేర కొత్త మోసానికి తెర తీశారు. రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000 చొప్పున 25 రోజుల పాటు రూ 25 వేలు తిరిగి ఖాతాలకు జమ చేస్తామంటూ జనానికి ఆశ చూపారు. తీర డబ్బులు చెల్లించే సమయానికి చేతులెత్తేశారు.

పలమనేరు మున్సిపాలిటీలోని మెప్మాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజేష్‌ను మేనేజర్‌గా నియమించి మోసాలుకు పాల్పడ్డారు మాయగాళ్ళు. మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించుకున్న రాజేష్ పెద్ద మొత్తంలో బిజినెస్ కొనసాగించారు. ఆన్ లైన్ యాప్ యాజమాన్యం ఎవరో తెలియకుండానే కేవలం ఫోన్ లోనే వ్యవహారం నడిపించిన రాజేష్ తాను కూడా మోసపోయాడు.

నియామకాలన్నీ ఆన్‌లైన్‌లోనే, ఫోన్‌లోనే సంప్రదింపులు జరిపారు. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి వేలాది మందిని సభ్యులుగా నమోదు చేయించారు. పొదుపు సంఘాల మహిళలే ప్రధాన టార్గెట్ గా సభ్యత్వ నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేసిన సభ్యునికి సకాలంలోనే వారి అకౌంట్స్ లో నగదు జమ చేసి నమ్మకం కలిగించిన కేటుగాళ్లు ఎట్టకేలకు భారీ మోసానికి పాల్పడ్డారు.

ప్రజల్లో విస్తృత ప్రచారం కోసం ఖరీదైన హోటళ్లలో మీటింగ్స్ పెట్టి యాప్ మేనేజర్ రాజేష్ ద్వారా నగదు పంపిణీ చేసిన యాప్ నిర్వాహకులు పక్కా ఫ్రాడ్ కు పాల్పడ్డారు. రాజేష్ స్థానికుడు కావడంతో నమ్మి మోసపోయారు. ఆన్‌లైన్ యాప్ ఏజెంట్లు పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్లు కావడంతో మహిళలు నమ్మి సభ్యులుగా చేరారు. సభ్యులు చెల్లించే సొమ్ము కన్నా అధికంగా డబ్బులు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఆకర్షితులైన జనం నిండా మోసపోయారు. యాప్ మేనేజర్ గా చలామణి అయిన రాజేష్ పరారీలో ఉండగా, ప్రవాహంలా అకౌంట్లోకి నగదు కోట్లల్లో జమ కావడంతో యాప్ లావాదేవీలు నిలిచిపోయాయి.

గత శనివారం ఒక్కరోజే బంపర్ ఆఫర్ అంటూ కొత్త స్కీం ను యాప్ యాజమాన్యం ప్రచారంలోకి తెచ్చింది. డబ్బు ఎంత కడితే అంతకు రెండింతలు 15 రోజుల్లోనే చెల్లిస్తానంటూ యాప్ యాజమాన్యం జనాన్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. దీంతో యాప్ యాజమాన్యం ట్రాప్ లో పడ్డ జనం రూ. కోట్ల లో డిపాజిట్లు చేశారు. ఆదివారం నుంచి యాప్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కొక్కరు చెవులు కొరుక్కొని మోస పోయినట్లు గుర్తించారు. DAAI యాప్ ఆర్థిక మోసానికి గురైన బాధితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు, పోలీను కుటుంబాలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాశతో కోట్లల్లో డబ్బు పోగొట్టుకొన్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహార వెలుగు చూసింది. వందలాది మంది బాధితులు సుమారు రూ 10 కోట్లకుపైగా ప్రజల సొమ్ము దోచుకున్నట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000.. తీరా చూస్తే..!
రూ 12 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ. 1000.. తీరా చూస్తే..!
కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. చిన్నారికి నిర్ధారణ..
కేరళలో మళ్ళీ వెలుగులోకి మెదడు తినే అమీబా.. చిన్నారికి నిర్ధారణ..
గేదేపై హీరోయిన్‏ను కూర్చొబెట్టి షూట్ చేసిన డైరెక్టర్..
గేదేపై హీరోయిన్‏ను కూర్చొబెట్టి షూట్ చేసిన డైరెక్టర్..
నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
నాన్నకు ప్రేమతో.. ఆ కొడుకులు ఏం చేశారంటే.. ఊహించని కానుక !!
అనంత అంబానీ వద్ద ఖరీదైన కార్లు.. వాటి ధర ఎంతో తెలుసా?
అనంత అంబానీ వద్ద ఖరీదైన కార్లు.. వాటి ధర ఎంతో తెలుసా?
మీ పేరు 'A' అక్షరంతో మొదలువుతోందా.? ఈ నిజాలను నమ్మి తీరాల్సిందే
మీ పేరు 'A' అక్షరంతో మొదలువుతోందా.? ఈ నిజాలను నమ్మి తీరాల్సిందే
ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..!
ఈ ఒక్క క్యాప్సూల్‌తో మచ్చలు, మొటిమలు తగ్గి మీ ముఖం మెరుస్తుందట..!
ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన హీరోయిన్..
ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడిన హీరోయిన్..
ఏపీ ఆర్థిక స్థితిపై మాజీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఏపీ ఆర్థిక స్థితిపై మాజీ సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడానికి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవ
ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడానికి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవ