Chicken Rates: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.340-350 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తుండగా, డజను గుడ్ల ధర రూ.90-100కు చేరింది. ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరల పెరుగుదల, సరఫరా లోపం, పెరిగిన డిమాండ్ కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Chicken Rates: కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవే..
Chicken Rates

Edited By:

Updated on: Jul 05, 2026 | 10:23 AM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి.. ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది వారాలుగా ధరలు వరుసగా పెరుగుతుండటంతో సాధారణ కుటుంబాల నెలవారీ ఖర్చులపై అదనపు భారం పడుతోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, సరఫరా లోపం, పెరిగిన డిమాండ్ వంటి కారణాలతో మార్కెట్‌లో ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో రూ.250 లోపు లభించిన చికెన్.. ప్రస్తుతం రూ.340 వరకు విక్రయిస్తున్నారు. డ్రెస్డ్ చికెన్ ధర కూడా భారీగా పెరిగింది. ఫారాల నుంచి వచ్చే లైవ్ బర్డ్ ధర పెరగడంతో పాటు రిటైల్ మార్కెట్‌లో అదనపు ఖర్చులు చేరి వినియోగదారులకు మరింత భారంగా మారింది.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ రూ.340 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. డ్రెస్సెడ్ చికెన్ కేజీ.. రూ.320 వరకు విక్రయిస్తున్నారు. బ్రాయిలర్ కోడి కేజీ.. ఫామ్ గేట్ ధర రూ.160 వరకు ఉంది. రిటైల్ మార్కెట్ లో రూ. 190 వరకు విక్రయిస్తున్నారు.

కోడిగుడ్ల ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇటీవల వరకు రూ.80లోపు దొరికిన డజను గుడ్లు.. ఇప్పుడు రూ.90 నుంచి 100 వరకు చేరుకున్నాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.8.50 మధ్య పలుకుతోంది. దీంతో ప్రతిరోజూ గుడ్లు వినియోగించే కుటుంబాలు ఖర్చును తగ్గించుకునే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.

వేసవి కాలం తర్వాత కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, మార్కెట్‌లో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, శుభకార్యాల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడంతో కూడా ధరలు మరింత ఎగబాకుతున్నాయని అంటున్నారు. మార్కెట్‌లో కొంతమంది వ్యాపారుల ఆధిపత్యం కూడా ధరలపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us