AP floods: ఏపీని ముంచెత్తిన వరదలు.. 33 మంది మృత్యువాత! ఎటు చూసినా కల్లోలమే..

|

Sep 05, 2024 | 7:53 PM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయవిదరక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందగా.. ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7 మంది మృతి చెందగా..

AP floods: ఏపీని ముంచెత్తిన వరదలు.. 33 మంది మృత్యువాత! ఎటు చూసినా కల్లోలమే..
Andhra floods
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 5: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హృదయవిదరక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలు వరదల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి చెందగా.. ఇద్దరు వరద నీటిలో గల్లంతయ్యారు. ఇక గుంటూరు జిల్లాలో 7 మంది మృతి చెందగా.. పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు వరద నీళ్లపాలైంది. రాష్ట్రంలో దాదాపు 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది.

రాష్ట్రంలో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారు. మరోవైపు ఫౌల్‌ట్రీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో పలు చోట్లు దాదాపు 60 వేల కోళ్లు మృతి చెందాయి. 275 పశువులు వరద నీళ్ల ధాటికి మరణించాయి. వరదల వలన 22 సబ్ రైల్వే స్టేషన్‌ల దెబ్బతిన్నాయి. 3,973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లోని 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయి. వర్షం వరదల వలన 6,44,536 మంది నష్టపోయారు. 214 రిలీప్ క్యాంపుల్లో ప్రస్తుతం 45,369 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం అందించేందుకు 6 హెలికాఫ్టర్లు పని చేస్తున్నాయి. 228 బోట్లను సిద్ధం చేశారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపారు. కృష్ణా నదికి లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినట్లు.. తాజా అప్‌డేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు

పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి, పార్వతీపురం, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ ఎలెర్ట్‌ను జారీ చేసింది. తీరం వెంబడి 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.