JanaSena: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం రెండు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలలో పోటీ చేయబోయే అభ్యర్థులను పేర్లను ప్రకటించింది జనసేన. ఇటీవలే జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు చోటు కల్పించింది. విజయవాడ కార్పొరేషన్ నుంచి -వంగవీటి రాధాకృష్ణ బరిలోకి దిగనున్నారు. ఏలూరు కార్పొరేషన్ అభ్యర్థిగా అప్పలనాయుడుకు అవకాశం కల్పించింది జనసేన.

JanaSena: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
Ana Sena Announces Candidates List

Updated on: Oct 17, 2026 | 12:54 PM

రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీ. కూటమి పొత్తులో భాగంగా 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాల్టీల్లో పోటీ చేస్తున్న జనసేన.. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖారారు చేసింది జనసేన. ఆ పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

కార్పొరేషన్ల అభ్యర్థుల వివరాలు

  • ఏలూరు కార్పొరేషన్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు
  • విజయవాడ కార్పొరేషన్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ

12 మున్సిపాలిటీల అభ్యర్థుల వివరాలు

  • అమలాపురం మున్సిపల్ అభ్యర్థిగా నల్లా శ్రీధర్
  • చిలకలూరిపేట మున్సిపల్ అభ్యర్థిగా తోట రాజరాజేశ్వరి
  • గొల్లప్రోలు మున్సిపల్ అభ్యర్థిగా కడారి తమ్మయ్య నాయుడు
  • నరసాపురం మున్సిపల్ అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ
  • నిడమవోలు మున్సిపల్ అభ్యర్థిగా కల్లం జ్యోతి
  • పెడన మున్సిపల్ అభ్యర్థిగా మట్టా శివపావని
  • పిఠాపురం మున్సిపల్ అభ్యర్థిగా డా. బీరా విజయ్ శేఖర్
  • పుత్తూరు మున్సిపల్ అభ్యర్థిగా డి. ఏలుమలై
  • సాలూరు మున్సిపల్ అభ్యర్థిగా గొర్లె విజయకుమారి
  • సామర్లకోట మున్సిపల్ అభ్యర్థిగా పిట్టా జానకి రామారావు
  • తెనాలి మున్సిపల్ అభ్యర్థిగా తోటకూర వెంకట రమణారావు
  • తిరువూరు మున్సిపల్ అభ్యర్థిగా పి. మాధవి

తొలి జాబితా వెలువడటంతో ఆయా పురపాలక సంఘాల్లో జనసేన శ్రేణులు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నాయి. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us