
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 26వ తేదీన తొలి విడత ఎన్నికలు జరగ్గా.. నవంబర్ 29వ తేదీన రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 2వ తేదీన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగా ప్రతి ఓటరు తన ఓటు ఏ వార్డులో నమోదై ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓటు వివరాలను కూడా సులభంగా ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. మీ మొబైల్ ఫోన్ ద్వారానే తనిఖీ చేసుకోవచ్చు. ఇదెలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ sec-ems.ap.gov.in ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో అనేక ఆప్షన్లు కనిపిస్తాయి
-నో యువర్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ ఎంచుకోండి
-“రూరల్ లోకల్ బాడీస్” (Rural Local Bodies) అని ఆప్షన్ ఎంచుకోండి.
-జిల్లా, మండలం, పంచాయతీ వివరాలను ఎంటర్ చేయండి
-మీ EPIC నంబర్‌ను ఎంటర్ చేసి సెర్చ్ చేయండి
-అన్ని వివరాలు సరిగ్గా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి
-సెర్చ్ చేసిన తర్వాత మీ ఓటు వివరాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
-ఇందులో మీ పేరు, తండ్రి పేరు, మండలం, పంచాయతీ పేరుతో పాటు మీ “వార్డు” (Ward) నంబర్ స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. మీ వివరాలు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలలో కనిపిస్తాయి
-మీ వివరాలను ప్రింట్ లేదా PDFగా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు
-క్రింద కనిపించే “ప్రింట్” ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ప్రింట్ అవుతుంది
-తదుపరి ప్రివ్యూ పేజీలో పైన కుడి వైపున ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేసి “సేవ్ యాస్ పిడిఎఫ్” ఆప్షన్‌ను ఎంచుకుని మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు