Independence Day 2022: ఏపీలో జైళ్ల నుంచి 175 మంది ఖైదీల విడుదల.. నూతన వస్ర్తాలు, చేతి ఖర్చులకు డబ్బు అందించిన వికాస తరంగిణి..

Prisoners Released: స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఏపీలో జైళ్ల నుంచి సత్‌ప్రవర్తన కలిగిన పలువురు ఖైదీలను విడుదల చేశారు. రాజమండ్రి, విశాఖ, కడప జైళ్ల నుంచే 140 మంది ఖైదీలు విడుదలయ్యారు.

Independence Day 2022: ఏపీలో జైళ్ల నుంచి 175 మంది ఖైదీల విడుదల.. నూతన వస్ర్తాలు, చేతి ఖర్చులకు డబ్బు అందించిన వికాస తరంగిణి..
Prisoners Released
Follow us

|

Updated on: Aug 15, 2022 | 9:28 PM

సత్‌ ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వీరంతా క్షణికావేశంలో నేరాలకు పాల్పడి పదేళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న వారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌ సిఫారసుల ఆధారంగా శిక్షా కాలంలో సత్‌ ప్రవర్తన కలిగిన మొత్తం 175 మంది విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 66 మంది, విశాఖ సెంట్రల్ జైలు నుంచి 42 మంది, కడప సెంట్రల్‌ జైలు నుంచి 35 మంది విడుదలయ్యారు.

రాజమండ్రి జైలు నుంచి విడుదలైన ఖైదీల్లో 55 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారని చెప్పారు జైలు సూపరింటెండెంట్‌ రాజారావు. రాజమండ్రిలో విడుదలైన ఖైదీలకు వికాస తరంగిణి ఆధ్వర్యంలో నూతన వస్ర్తాలు, ఖర్చులకు కొంత నగదు అందజేశారు. శ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి ఆదేశాల మేరకు ఈ సహాయం అందించామని వికాస తరంగిణి ప్రతినిధి చెప్పారు.

విశాఖలో విడుదలైన ఖైదీలకు జిల్లా జడ్జి హరినాధ శర్మ కౌన్సిలింగ్ ఇచ్చారు. సత్‌ ప్రవర్తన అనేది తాత్కాలికం కాకూడదని, శాశ్వతంగా ఉండాలన్నారు. నేరాన్ని ద్వేషించు కానీ నేరస్తుడిని కాదన్న గాంధీజీ మాటలను గుర్తుచేశారు. జైలు నుంచి బయటికి వెళ్లాక ఎలా బతకాలో ఖైదీలకు నేర్పించామన్నారు విశాఖ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌.

కడప జైలు నుంచి 32 మంది ఖైదీలు విడుదలయ్యారు. నెల్లూరు, అనంతపురం, ఒంగోలు, పొనుగొండ, ధర్మవరం జైళ్ల నుంచి కూడా 30 మందికి పైగా ఖైదీలకు విముక్తి లభించింది. క్షణికావేశంలో నేరాలు చేసిన తాము జైలు జీవితం తర్వాత పూర్తిగా మారామన్నారు విడుదలైన ఖైదీలు. వీరిలో జైలులో ఉన్నప్పుడు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం