Nadendla Manohar : బాధ్యతలు చేపట్టక ముందే రంగంలోకి దిగిన మంత్రి.. దెబ్బకు అధికారుల ఉరుకులు, పరుగులు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన ముద్ర వేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెనాలి అభివృద్దిపై దృష్టి సారించారు. పట్టణంలోని కాలువల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలంటూ అధికారులకు హూకుం జారీ చేశారు

Nadendla Manohar :  బాధ్యతలు చేపట్టక ముందే రంగంలోకి దిగిన మంత్రి.. దెబ్బకు అధికారుల ఉరుకులు, పరుగులు
Nadendla Manohar
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 15, 2024 | 9:22 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండే మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన ముద్ర వేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తెనాలి అభివృద్దిపై దృష్టి సారించారు. పట్టణంలోని కాలువల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలంటూ అధికారులకు హూకుం జారీ చేశారు. ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. దాదాపు 47 కిలోమీటర్ల మేర ఎనిమిది ప్రధాన కాలువలను శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాలువలను ఆక్రమించిన వారంతా కూడా తమ ఆరోగ్యం బాగుండాలంటే కాలువల శుభ్రం చేయడానికి సహకరించాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన ఎన్డీయే సర్కార్‌లో నాదెండ్లకు సివిల్ సప్లైస్ ఫోర్ట్ ఫోలియోను కేటాయించారు. ఇంకా మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించక ముందే నాదెండ్ల పనిలోకి దిగిపోయారు. తెనాలి నియోజకవర్గంలోని పౌర సరఫరాల గిడ్డంగులను అధికారులతో కలిసి పరిశీలించారు. గిడ్డంగుల్లో ఎంత స్టాక్ ఉందో రికార్డుల్లో చెక్ చేశారు. వచ్చే నెల కోటాకు సంబంధించి ఎంత బియ్యం పంపిణి చేయాలో అడిగి తెలుసుకున్నారు. మంత్రి నేరుగా రంగంలోకి దిగడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. మనోమర్ అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇచ్చారు. పౌర సరఫరాల శాఖను అత్యుత్తమంగా తీర్చిదిద్ది ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సరుకులు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..