తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో నవంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది నవంబర్ 14న స్పష్టమైన అల్పపీడనంగా, 15న వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో ఏపీ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Update

Updated on: Nov 12, 2026 | 1:19 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన నిన్నటి ఉపరితల ఆవర్తనం, ఈ రోజు, నవంబర్ 12, 2026, ఉదయం 0830 గంటలకు (IST) అదే ప్రాంతంలో కొనసాగుతూ మధ్య ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, నవంబర్ 13, 2026 న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది వాయువ్య దిశగా కదులుతూ, నవంబర్ 14వ తేదీ న స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా, నవంబర్ 15వ తేదీ న అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

తెలంగాణలో..

ఇదిలాఉంటే.. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది.. అల్పపీడనం ఏర్పడిన తర్వాత అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us