Andhra Pradesh: జాలర్ల జాడ కోసం కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్‌.. బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన మాజీ మంత్రులు..

Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్  జరుగుతోంది

Andhra Pradesh: జాలర్ల జాడ కోసం కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్‌.. బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చిన మాజీ మంత్రులు..
Follow us

|

Updated on: Jul 06, 2022 | 1:20 PM

Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీస్, రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్, కోస్ట్ గార్డ్, నేవల్, వాతావరణ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్  జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రంలో జాలర్ల కోసం వేట కొనసాగుతుంది. మచిలీపట్నం జాలర్ల బోటు చివరిగా అంతర్వేది కి 10 కీలోమీటర్ల దూరంలో ఆగిపోయినట్టు బోటు యజమానికి కాల్ వచ్చింది. వెంటనే అంతర్వేది స్పాట్ వద్దకు వెళ్ళి చూస్తే బోటు కనిపించలేదంటున్నారు బోట్ ఓనర్. ప్రస్తుతం అంతర్వేది, కరవాక, నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల సముద్రతీరంలో గాలిస్తున్నారు అంతర్వేది మెరైన్ పోలీసులు. ఇప్పటివరకు మత్స్యకారుల బోటు జాడ కనిపించకపోవడంతో అంతర్వేది తీరంలో రెండు మెరైన హెలికాప్టర్లతో గాలింపు చేపట్టారు.

కంగారు పడొద్దు..

మచిలీపట్నం క్యాంప్‌బెల్‌పేటకు చెందిన చిన్నమస్తాన్‌, చిననాంచారయ్య, నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు శనివారం గిలకలదిండి నుంచి మరబోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు. వాస్తవానికి చేపల వేట ముగించుకుని మంగళవారం మత్స్యకారులు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. జాలర్ల సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ కావడంతో గాలింపు మరింత కష్టంగా మారింది. మరోవైపు గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలకు మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. ఎవరూ కంగారు పడొద్దంటూ బాధితులను ఓదార్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా బాధితులను పరామర్శించారు. గాలింపులో ఆలస్యం జరగడంతో కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాలింపు చర్యల్లో ప్రభుత్వ నిలర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని, కేంద్ర సహాయం తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!