వీడు మామూలోడు కాదు.. మూడు పెళ్లిళ్లు అపై మూడు వివాహేతర సంబంధాలు! బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కుల పెద్దలు

| Edited By: Srilakshmi C

Sep 02, 2023 | 11:03 AM

కటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదే స్థాయిలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తప్పు అని వారించిన వారిపై కూడా దాడి చేస్తున్నాడు. పద్దతి మార్చుకోగ పోగా పగతో రగిలిపోతున్న అతనిపై కాలనీ పెద్దలు కఠిన శిక్షే విధించారు. ఏకంగా కాలనీ నుండి బహిష్కరించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

వీడు మామూలోడు కాదు.. మూడు పెళ్లిళ్లు అపై మూడు వివాహేతర సంబంధాలు! బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కుల పెద్దలు
Man Had Three Marriages And Three Extra Marital Affairs
Follow us on

గుంటూరు, సెప్టెంబర్ 2: ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదే స్థాయిలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తప్పు అని వారించిన వారిపై కూడా దాడి చేస్తున్నాడు. పద్దతి మార్చుకోగ పోగా పగతో రగిలిపోతున్న అతనిపై కాలనీ పెద్దలు కఠిన శిక్షే విధించారు. ఏకంగా కాలనీ నుండి బహిష్కరించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

ఇతని పేరు గంధం లక్ష్మయ్య… ఊరు పల్నాడు జిల్లా గురజాలలోని బేడ బుడగ జంగాల కాలనీ… ఏంపని చేస్తుంటాడనా మీ డౌట్ ఏముంది పెళ్లిళ్లు చేసుకుంటుంటాడు.. ఆపై కాలనీ వాసుల మద్య వివాదాలు పెడుతుంటాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఆమెకు తెలియకుండా మరొకరికి ఇలా మూడే పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై లక్ష్మయ్య వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో కుల పెద్దలు రంగం ప్రవేశం చేశారు. తప్పని వారించారు. అయితే నా ఇష్టం నాఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీరెవరూ నాకు చెప్పటానికి అంటూ లక్ష్మయ్య పెద్దలనే ఎదిరించాడు.

ఇంతటితో ఆగలేదు. కాలనీ వాసుల మధ్య గొడవలు పెట్టడం ప్రారంభించాడు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ వివాదాస్పదంగా మారాడు. దీంతో ఏం చేయాలో అర్ధంకాక అందరూ తలలు పట్టుకున్నారు. పోలీసులకు లక్ష్మయ్య తీరుపై ఫిర్యాదు చేశారు. అయినా మార్పు రాలేదు. దీంతో తమ కుల కట్టుబాట్లను బయటకు తీశారు. కుల పెద్దలంతా కూర్చోని కుల సమావేశం పెట్టుకున్నారు. లక్ష్మయ్య వ్యవహారంపై సీరియస్ గాచర్చించారు. అందరకి అభిప్రాయాలు తీసుకున్నారు. అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. కుల పెద్దల పంచాయితీలో కుల పెద్ద సూరయ్య పెదరాయుడు స్థాయిలో తీర్పు చెప్పేశాడు. కాలనీ నుండి లక్ష్మయ్య బహిష్కరిస్తున్నట్లు కుల పెద్దల పంచాయితీ నిర్ణయించిందన్నారు. ఈవిషయాన్ని మీడియాకు చెప్పేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే కుల పెద్దల పంచాయితీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘ విద్రోహ శక్తిగా మారిన వ్యక్తిపై కుల పెద్దలు సరైన నిర్ణయం తీసుకున్నారని కొందరంటుంటే మరికొందరూ మాత్రం ఇంకా కులం కట్టుబాటు ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరూ చట్టంలో పిడి యాక్ట్ పెట్టి జిల్లా బహిష్కరణ చేసినట్లే లక్ష్మయ్యను ఏకంగా జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయితితో పోలీసులు ఏవిధంగా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.