Andhra Pradesh: ఏపీలోని యువతకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్.. రూ.4 లక్షల వరకు పొందోచ్చు.. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు..

ఏపీ యువతకు ప్రభుత్వం శుభవారత్ అందించంది. జనరిక్ మందుల షాపులను కేటాయించనుంది. దీని ద్వార భారీగా ఆదాయం పంపాదించుకోవచ్చు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.

Andhra Pradesh: ఏపీలోని యువతకు ప్రభుత్వం సూపర్ ఛాన్స్.. రూ.4 లక్షల వరకు పొందోచ్చు.. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు..
Andhra Pradesh

Updated on: Sep 03, 2026 | 10:43 AM

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జనరిక్ మందుల షాప్ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించనుంది. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులను యువతకు ప్రభుత్వం కేటాయించనుంది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ చదువుకున్న బీసీ నిరుద్యోగ యువత దీని ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. తొలి విడతలో రాష్ట్రంలో 198 షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.7.92 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. బీసీ యువతకు కార్పొరేషన్ల వారీగా లబ్దిదారులను ఎంపిక చేసి మంజూరు చేయనున్నారు.

ఏకంగా రూ.4 లక్షల సబ్సిడీ

బీసీఏ, బీసీ బీ, బీసీ డీ, బీసీ ఈ కార్పొరేషన్ల వారీగా లబ్దిదానులను ఎంపిక చేసి వారికి ఈ జనరిక్ మందుల షాపులను కేటాయించనున్నారు. యువతకు స్వయం ఉపాధి లభించడమే కాకుండా ఈ షాపుల ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే జనరిక్ మందులు లభించనున్నాయి. ఇలా రెండు రకాలుగా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. వీటిని నడుపుకునే యువతకు ప్రభుత్వం 50 శాతం రాయితీ సౌకర్యం కల్పించనుంది. ఒక షాపుకు రూ.8 లక్షల ఖర్చు అయితే ప్రభుత్వం రూ.4 లక్షల సబ్సిడీ అందించనుంది. మిగతా రూ.4 లక్షలు బ్యాంక్ ద్వారా రుణం కూడా ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీంతో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా యువత ఈ షాపులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన షాపును లబ్దిదారులే సమకూర్చుకోవాలి. అందులో అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

త్వరలో విధివిధానాలు ఖరారు

మెడికల్ షాపులో ఫర్నీచర్, మెడిసిన్స్ కొనుగోలు, ఇతర అవసరాలకు బ్యాంక్ ద్వారా ప్రభుత్వం అడ్వాన్స్ రూపంలో కొంతమంది ఇప్పించనుంది. అనంతరం మిగతా సొమ్ము బ్యాంకులు అందిస్తాయి. ఇప్పటికే మెడికల్ షాపులు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. కొత్తగా మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలనుకునే బీసీ యువత ఇందుకు అర్హులు. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ చదివి ఉండాలి. ఈ జనరిక్ షాపుల్లో 50 నుంచి 80 శాతం తక్కువ ధరకే మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో ఇవి తయారవుతాయి. త్వరలో ఈ పథకానికి సంబంధించిన విదివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా ఇప్పటికే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. వారికి డెయిరీ పార్లర్లు కేటాయించడం లాంటివి చేస్తోంది. ఇప్పుడు బీసీ యువతకు కూడా అదే తరహాలోనే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీని ద్వారా స్వయం ఉపాధి కల్పన జరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us