AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీలో లోకల్‌ వార్.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జబర్దస్త్ నటుల ప్రచారం!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు బరిలో ఉన్న పార్టీలు అవసరమైన వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అనకాపల్లి జిల్లాలో కూటమి అభ్యర్థులు జబర్దస్త్ నటులను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తున్నారు.

Andhra News: ఏపీలో లోకల్‌ వార్.. ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జబర్దస్త్ నటుల ప్రచారం!
Jabardasth Artists Campaign For Gvmc Ward 18 Candidate
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 9:06 PM

Share

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ఊపందుకుంది. పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నారు. కొందరు ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతుంటే.. మరికొందరు నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి, తమదైన శైలిలో వారి పనుల్లో సాయం చేస్తూ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నారు. తాజాగా జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ నటులు సందడి చేశారు. కూటమి అభ్యర్థుల తరఫున వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధి కొంతవరకు అనకాపల్లి జిల్లాలోనూ విస్తరించి ఉంది. జీవీఎంసీ జోన్-10 పరిధిలో ఆరు వార్డులు ఉన్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా 18వ వార్డు కూటమి అభ్యర్థి కొణతాల సింధుజకు మద్దతుగా జబర్దస్త్ నటులు ప్రచారం చేపట్టారు. నటులు వినోదిని, రాపేటి అప్పారావు, రాజు అభ్యర్థితో కలిసి వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. వారు తమదైన శైలిలో వినోదాత్మకంగా ప్రచారం చేయడంతో, ఆ నటులను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us