AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ జూపార్క్‌ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన గోనెసంచి.. పోలీసులు వెళ్లి చూడగా..

ఒక ప్లాస్టిక్ గోనెసంచి... అందులో కుక్కి ఉన్న ఒక మృతదేహం...! అది హత్యేనా...? లేక రోడ్డు ప్రమాదాన్ని దాచడానికి జరిగిన కుట్రనా..? అసలు వైజాగ్ జూపార్క్ రోడ్డు పక్కన ఏం జరిగింది...? స్థానికులు చెబుతున్నదేంటి...? పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతోంది ...?

విశాఖ జూపార్క్‌ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన గోనెసంచి.. పోలీసులు వెళ్లి చూడగా..
Vizag Zoo
Ram Naramaneni
|

Updated on: Oct 24, 2026 | 6:47 PM

Share

విశాఖపట్నంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే వైజాగ్ జూపార్క్ పరిసర ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. ఆరవాల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మిస్టరీ వెలుగుచూసింది.

విశాఖ వ్యాలీ స్కూల్ నుంచి జూపార్క్‌కు వెళ్లే దారిలో పొదల మధ్య అనుమానాస్పదంగా ఒక నీలం రంగు గోనెసంచి కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంచి విప్పి చూడగా… లోపల కుళ్లిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతుడి శరీర భాగాలపై ఉన్న గుర్తులు చూస్తుంటే ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తలపై తీవ్రమైన గాయాలున్నాయి. కుడి భుజం, తలపై ఓ భారీ వాహనం వెళ్లిన టైరు గుర్తులున్నాయి. అలాగే చేతులు, కాళ్లకు నల్లటి గ్రీస్ మరకలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుడు ఆటోమొబైల్ వర్కర్ లేక క్లీనర్ అయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక అంచనాకొచ్చారు. జూపార్క్‌తో పాటు నేషనల్ హైవే పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

ఎక్కడో హత్య చేసి బాడీని ఇక్కడ పడేశారా…? లేక అర్ధరాత్రి వేగంగా వచ్చిన ఏదైనా వాహనం తొక్కేయడంతో చనిపోతే… ఆ ప్రమాదాన్ని దాచడానికి శవాన్ని సంచిలో కట్టి ఇక్కడ విసిరేశారా…? అన్న కోణంలోనూ అరిలోవా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మరి చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుతుందో…!

Follow Us
విశాఖ జూపార్క్‌ వద్ద అనుమానాస్పద గోనెసంచి.. ఓపెన్ చేయగా
విశాఖ జూపార్క్‌ వద్ద అనుమానాస్పద గోనెసంచి.. ఓపెన్ చేయగా
2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ
2027 ప్రపంచకప్‌.. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై బీసీసీఐ చీఫ్ క్లారిటీ
Video: ఇదేం రెస్టారెంట్ బాబోయ్! టాయిలెట్ బౌల్స్‌లో ఫుడ్
Video: ఇదేం రెస్టారెంట్ బాబోయ్! టాయిలెట్ బౌల్స్‌లో ఫుడ్
యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని!
యువకుడిని కిడ్నాప్‌ చేసిన దొంగలు.. అతని వద్ద డబ్బులు లేవని!
నాన్‌స్టిక్ పెనం లేకున్నా.. ఇనుప పెనంపై అంటుకోకుండా దోశలు రెడీ
నాన్‌స్టిక్ పెనం లేకున్నా.. ఇనుప పెనంపై అంటుకోకుండా దోశలు రెడీ
ఈ రూల్స్ పాటించకపోతే వాటర్ ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు!
ఈ రూల్స్ పాటించకపోతే వాటర్ ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు!
ఉస్మానియా ఆసుపత్రిలో లింగమార్పిడి శస్త్రచికిత్సలు
ఉస్మానియా ఆసుపత్రిలో లింగమార్పిడి శస్త్రచికిత్సలు
మిగిలిపోయిన అన్నంతో ఇలా కరకరలాడే పూరీలు చేశారంటే.. ప్లేట్ ఖాళీ
మిగిలిపోయిన అన్నంతో ఇలా కరకరలాడే పూరీలు చేశారంటే.. ప్లేట్ ఖాళీ
నాడు సచిన్.. 36 ఏళ్ల తర్వాత అదే మైదానంలో నేడు వైభవ్..
నాడు సచిన్.. 36 ఏళ్ల తర్వాత అదే మైదానంలో నేడు వైభవ్..
ఏడిస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా.. కన్నీళ్లతో కలిగే ఈ లాభాలు..
ఏడిస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారా.. కన్నీళ్లతో కలిగే ఈ లాభాలు..