మట్టి తిని పాప ఆకలి చావు..అనంతలో హృదయవిదారకం

అనంతపురం జిల్లాలో ఓ చిన్నారి ఆకలిచావు  అందరిని కంటతడి పెట్టించింది. కదిరి మండలంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలికి తట్టుకోలేక మట్టిని తిని అనారోగ్యంపాలై కన్నుమూసింది. ఈ నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. కూలి […]

మట్టి తిని పాప ఆకలి చావు..అనంతలో హృదయవిదారకం
Follow us

|

Updated on: May 03, 2019 | 6:18 AM

అనంతపురం జిల్లాలో ఓ చిన్నారి ఆకలిచావు  అందరిని కంటతడి పెట్టించింది. కదిరి మండలంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలికి తట్టుకోలేక మట్టిని తిని అనారోగ్యంపాలై కన్నుమూసింది. ఈ నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. కూలి చేసుకుంటూ మహేష్ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఈ దంపతులకు ఐదుగురు సంతానం. కాగా నీలవేణి అక్క కూతుర్ని తమ వద్దే పెంచుకుంటున్నారు. ఓ చిన్న గుడారం వేసుకుని దాంట్లోనే జీవనం సాగిస్తున్నారు. మహేష్ ఒక్కడిపైనే కుటుంబ భారం పడటంతో అప్పుడప్పుడు వచ్చే కూలి డబ్బులు వారి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. ఈ నేపథ్యంలో నీలవేణి మద్యానికి బానిసయ్యింది. ఇక మహేష్ పొద్దున్నే కూలికి వెళ్లిపోవడంతో పిల్లల ఆలనా, పాలనా చూసేవాళ్లు లేరు.మూడు రోజుల క్రితం రెండేళ్ల వయసు కలిగిన  పాప (నీలవేణి అక్క కూతురు) ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై  మృతి చెందింది. కలిచివేసే సంఘటన ఏంటంటే విరుంటున్న గుడారం పక్కనే పాప మృత దేహాన్ని పూడ్చిపెట్టారు. ఏడాది కిందట కూడా వీరి పిల్లలో ఒక పాప ఇలానే అనారోగ్యంతో చనిపోయింది.

ఇల్లు లేదు..సరైన ఆహారం లేదు, త్రాగడానికి మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. పైగా 45 డిగ్రీలకు పైగా ఎండలు. అసలు వారి కష్టాలను ఊహించుకుంటుంటేనే గుండెల్లో కన్నీరు ఉబుకుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే పేరుంది.ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగిందంటేనే వినడానికి కష్టంగా ఉంది.ఇప్పటికైనా మార్పు రావాలి. ఇటువంటి ఆకలి చావులు ఉండకూడదు. ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరూ ఇలా హృదయ విదారకంగా ఆకలి చావులకు గురికాకూడదని TV9 మనస్పూర్తిగా కోరుకుంటోంది

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.