అయ్యో టీజీ.. ఇలా టంగ్ స్లిప్ అయ్యారేంటీ..!

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. టీడీపీని వీడి బీజేపీలో చేరినా.. ఇంకా సైకిల్ జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తున్నట్లున్నాయి. తాను టీడీపీ వదిలి బీజేపీలోకి వెళ్లినా.. ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నారో.. లేక అలవాటులో పొరబాటుగా టంగ్ స్లిప్ అయ్యారో తెలీదు కానీ.. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో మాత్రం.. మా తెలుగుదేశం ఎంపీలంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో భాగంగా.. ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. ఈ క్రమంలో రాజధాని […]

అయ్యో టీజీ.. ఇలా టంగ్ స్లిప్ అయ్యారేంటీ..!

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. టీడీపీని వీడి బీజేపీలో చేరినా.. ఇంకా సైకిల్ జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తున్నట్లున్నాయి. తాను టీడీపీ వదిలి బీజేపీలోకి వెళ్లినా.. ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నారో.. లేక అలవాటులో పొరబాటుగా టంగ్ స్లిప్ అయ్యారో తెలీదు కానీ.. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో మాత్రం.. మా తెలుగుదేశం ఎంపీలంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో భాగంగా.. ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. ఈ క్రమంలో రాజధాని అంశాన్ని మూడు ముక్కలాట చేయొద్దన్నారు. మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరిగేలా… మినీసెక్రటేరియట్‌, ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలను, హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. అయితే అదే ఫ్లోలో మాట్లాడుతున్న టీజీ.. చైనాలో ఉన్న తెలుగు వారిని తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా మా తెలుగుదేశం ఎంపీలంటూ.. నాలుక కరుచుకున్నారు. అయితే, అది గమనించిన అక్కడి మీడియా ప్రతినిధులు.. మీరు బీజేపీలో ఉన్నారంటూ గుర్తు చేశారు. దీంతో వెంటనే నాలుక్కర్చుకుని.. సారీ తెలుగు ప్రజలంటూ సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.

Published On - 3:57 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu