Video: వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన దృశ్యం.. ఏంటా అని చూడగా..!

విజయనగరం జిల్లాలో పదమూడు అడుగుల భయానక కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. కొత్తవలస స్టేషన్ రోడ్డులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భారీ కింగ్ కోబ్రా స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు పదమూడు అడుగుల పొడవున్న ఈ విషసర్పం రోడ్డుపై సంచరిస్తూ కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Video: వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన దృశ్యం.. ఏంటా అని చూడగా..!
Kothavalasa Station Road

Edited By:

Updated on: Apr 11, 2026 | 10:01 PM

విజయనగరం జిల్లాలో పదమూడు అడుగుల భయానక కింగ్ కోబ్రా హాల్ చల్ చేసింది. కొత్తవలస స్టేషన్ రోడ్డులో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన భారీ కింగ్ కోబ్రా స్థానికులను, ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సుమారు పదమూడు అడుగుల పొడవున్న ఈ విషసర్పం రోడ్డుపై సంచరిస్తూ కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వాహనాల లైట్ల మధ్య నల్లగా మెరుస్తూ కనిపించిన కింగ్ కోబ్రాను చూసి రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ ఆగిపోయారు. కొందరు దూరం నుంచి వీడియోలు తీయగా, మరికొందరు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. వాహనాల లైట్లు పడడంతో కింగ్ కోబ్రా మరింత ఆగ్రహంగా ప్రవర్తిస్తూ పడగ ఎత్తి చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురిచేసేలా ప్రవర్తించింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను ఘటనాస్థలానికి చేరుకుని జాగ్రత్తగా పామును అదుపులోకి తీసుకున్నాడు. కొంతసేపు శ్రమించిన అనంతరం కింగ్ కోబ్రాను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే స్థానికులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఈ పరిసర ప్రాంతంలో గడిచిన రెండు రోజుల్లో ఇలాంటి భయానక కింగ్ కోబ్రాలు సంచరించిన ఘటనలు రెండు జరిగాయని ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే అడవులకు సమీప ప్రాంతాల్లో ఇలాంటి విషసర్పాలు బయటకు రావడం సహజమేనని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. పాములను చూసినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా వెంటనే అటవీ శాఖ లేదా స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us