AP News: పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూడగా..! అమ్మబాబోయ్

పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా.. దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిపోతు..! జీవన పోరాటం ఒక పాముదైతే.. మరొక పాముది ఆకలి కోసం ఆరాటం.! ఓ పామును మరో పాము వెంటాడింది. ప్రాణ భయంతో మరోపాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ చివరకు రెండూ బావిలో పడిపోయాయి.

AP News: పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూడగా..! అమ్మబాబోయ్
Representative Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 12, 2024 | 11:59 AM

పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా.. దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిపోతు..! జీవన పోరాటం ఒక పాముదైతే.. మరొక పాముది ఆకలి కోసం ఆరాటం.! ఓ పామును మరో పాము వెంటాడింది. ప్రాణ భయంతో మరోపాము తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ చివరకు రెండూ బావిలో పడిపోయాయి. ప్రాణ భయంతో తప్పించుకుంటూ వెళ్లిన ఓ పాము చివరకు నీటిలో ఊపిరి వదిలింది.. వెంటాడిన మరోపాముకు ప్రాణాన్ని కాపాడుకోవాలని అనుకొని బయటపడేందుకు ప్రయత్నించి విఫలమైంది. చివరకు సమాచారం అందుకున్న స్థానికులు.. అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ల సహకారంతో.. అతి కష్టం మీద రెస్క్యూ చేశారు. భారీ గిరినాగును ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల ఓ పొలంలోని బావిలో ఈ ఘటన జరిగింది.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

వివరాల్లోకెళ్తే.. పాములు తమ ఆకలిని తీర్చుకునేందుకు బల్లులు, కప్పలు, కీటకాలు, జంతువులు, గుడ్లతో పాటు అదే జాతికి చెందిన మరో పాములను కూడా తినేస్తుంటాయి. కప్పని పాము మింగడం సహజంగా చూస్తుంటాం. కానీ పామును, మరో సర్పం అమాంతంగా మింగేస్తుంటాయి. వేటాడుతూ.. వెంటాడుతూ.. భారీ పాములు తనకంటే చిన్న పరిమాణంలో ఉన్న పాములను తిని ఆకలి తీర్చుకుంటుంటాయి.

వేటాడుతూ బావిలో పడి..

అనకాపల్లి జిల్లాలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆరడుగుల జెర్రిగుడ్డుపై ఆకలితో ఉన్న పన్నెండు అడుగుల గిరినాగు కన్నేసింది. అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల గ్రామ శివారు పోతల ఈశ్వరరావు అనే రైతు బావిలో ఏదో శబ్దం వినిపించింది. వెళ్లి చూడగా.. అక్కడ ఏదో అటు ఇటు కదులుతున్నట్టు కనిపించింది. తదేకంగా చూస్తే.. ఓ పాము ప్రాణాలు కోల్పోయి పైకి తేలుతున్నట్టు ఉంది. ఆ పక్కనే మరో భారీ పాము బావి నుంచి బయట పడేందుకు ఆరాటపడుతోంది. సుమారు 12 అడుగుల గిరినాగు.. జెర్రిపోతు అనే పామును వెంటాడుతూ బావిలో పడింది.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

అతికష్టం మీద రెస్క్యూ చేసి..

అది చూసిన రైతు ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యాడు. అయినా ఆ పామును ప్రాణాపాయం నుంచి తప్పించాలనుకున్నాడు. ఫారెస్ట్ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కి సమాచారం అందించాడు ఆ రైతు. సమాచారం తెలుసుకున్న వెంకటేష్ ఘటనాస్థలికి చేరుకున్నాడు. దాదాపు రెండు గంటలు పాటు శ్రమించి అతికష్టం మీద భారీ కింగ్ కోబ్రాను బావి నుంచి బయటకు తీసారని అన్నారు రైతు ఈశ్వర్. రెస్క్యూ చేసిన గిరినాగును సమీపంలోనే అడవుల్లో విడిచిపెట్టారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!