వర్చువల్‌గా ఉదయానంద ఆస్పత్రిని ప్రారంభించిన జగన్

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్‌ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.

వర్చువల్‌గా ఉదయానంద ఆస్పత్రిని ప్రారంభించిన జగన్
Follow us

|

Updated on: Aug 14, 2020 | 3:32 PM

ప్రతి పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందన్నదే తమ లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. శుక్రవారం నంద్యాలలోని ఉదయనంద హాస్పిటల్‌ను క్యాంపు ఆఫీస్ నుండి సీఎం జగన్ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ఉద‌యానంద హాస్పిట‌ల్‌ను సీఎం వైఎస్ జ‌గ‌న్‌ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిట‌ల్ డైరెక్ట‌ర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. నూత‌న హాస్పిట‌ల్ ద్వారా ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు వైఎస్ జ‌గ‌న్ వెల్ల‌డించారు. ప్రతి ఒక్కరికి మెరగైన వైద్యం అందించాలని సూచించారు, ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ స్వప్నారెడ్డి. తదితరులు పాల్గొన్నారు.