వ‌న్ మోర్ స్టెప్…టెస్టుల విష‌యంలో ఏపీ సర్కార్ మ‌రో ముంద‌డుగు

య‌స్...క‌రోనాను క‌ట్ట‌డి చెయ్య‌డానికి ఏపీ ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ప‌రీక్ష‌లు విష‌యంలో ఇప్ప‌టికే ముందు వ‌రుస‌లో ఉన్న ఏపీ స‌ర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చింది.

వ‌న్ మోర్ స్టెప్...టెస్టుల విష‌యంలో ఏపీ సర్కార్ మ‌రో ముంద‌డుగు
Follow us

|

Updated on: Jul 11, 2020 | 6:39 PM

య‌స్…క‌రోనాను క‌ట్ట‌డి చెయ్య‌డానికి ఏపీ ప్ర‌భుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ప‌రీక్ష‌లు విష‌యంలో ఇప్ప‌టికే ముందు వ‌రుస‌లో ఉన్న ఏపీ స‌ర్కార్..కోవిడ్-19 ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చింది. క‌రోనా చికిత్స‌కు ధ‌ర‌ల‌ను కూడా ఫిక్స్ చేసింది. తాజాగా క‌రోనాకు వైద్యం అదించే హాస్పిట‌ల్స్ ను మోనేట‌రింగ్ చేసేందుకు ఐఏఎస్ ఆఫిస‌ర్ రాజమౌళిని నియమించింది. ఇప్పుడు క‌రోనా ప‌రీక్ష‌ల విషయంలో ఏపీ మ‌రో ముంద‌డుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు చేయడాన్ని మరింత ఈజీ చేసింది. ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఇంట్లోనే కూర్చొని అధికారులకు తెలియజేయవచ్చు. ఇందుకోసం గ‌వ‌ర్న‌మెంట్ ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఓ ట్వీట్ చేశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కోవిడ్-19 చేయించుకోవాలి అనుకుంటే.. (https://covid-andhrapradesh.verahealthcare.com/person/register )ఈ లింక్ ఓపెన్ చేసి మీ డీటేల్స్ నమోదు చేసుకోండి. సంబంధిత అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు.’’ అని గోపాలకృష్ణ ద్వివేది వివ‌రించారు. ఈ లింక్ ఓపెన్ చేసి సంబంధిత వ్యక్తి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, అనారోగ్య స‌మ‌స్య‌, చిరునామా వంటి ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత ఆఫీస‌ర్ సదరు వ్యక్తికి ఫోన్ చేసి కరోనా టెస్టుల‌కు ఏర్పాటు చేస్తారు.