ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ మీటింగ్ పై ప్రపంచ చూపు

కరోనా మహమ్మారి ప్రపంచ స్థితిగతుల్నే మార్చివేసిన వేళ ఈ ఏడాది చివర్లో క్వాడ్(QUAD)విదేశాంగ మంత్రుల సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ మీటింగ్ పై ప్రపంచ చూపు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 9:06 PM

కరోనా మహమ్మారి ప్రపంచ స్థితిగతుల్నే మార్చివేసిన వేళ ఈ ఏడాది చివర్లో క్వాడ్(QUAD)విదేశాంగ మంత్రుల సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ ఏడాది చివర్లో క్వాడ్ సమావేశం నిర్వహించాలని తాము ఎదురుచూస్తున్నామని దీనికోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. భారతదేశంతో పాటు, క్వాడ్ చతుర్భుజ భద్రతా సంభాషణలో ఆస్ట్రేలియా, జపాన్ ఇంకా యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశ వేళ క్వాడ్ సమావేశంతోపాటు, ఇండియా-యుఎస్ 2 + 2 మీటింగ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. చైనాతో ఉద్రిక్తత వాతావరణం మధ్య క్వాడ్ మీట్‌ను నిర్వహించడానికి భారత్ ముందుకు రావడంతో ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆసక్తి రేగింది. దీనికి తోడు క్వాడ్ దేశాలన్నీ కరోనా నేపథ్యంలో చైనాపై గుర్రుగా ఉన్న సమయంలో మీటింగ్ జరుగుతుండటం మరింత ప్రాముఖ్యత లభిస్తోంది. ఈ క్వాడ్ బృంద విదేశాంగ మంత్రులు గత ఏడాది న్యూయార్క్‌లో యుఎన్ జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) సందర్భంగా సమావేశమమైన సంగతి తెలిసిందే.