అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ‘ ఆందోళన ‘

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికణం రద్దు వెనుక భారత ప్రభుత్వ ‘ అభివృధ్ది అజెండా ‘ ఏమిటో తమకు తెలుసునని అమెరికా అంటోంది. అయితే ఆ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని యుఎస్ చెబుతోంది. కాశ్మీర్ లోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా వ్యవహారాలపై గల అమెరికా విదేశాంగ శాఖలోని తాత్కాలిక కార్యదర్శి అలీస్ వెల్స్ తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో బాటు కాశ్మీర్ […]

అభివృధ్ది సరే ! జమ్మూ కాశ్మీర్ విషయమేంటి ? అమెరికా ' ఆందోళన '
Follow us

|

Updated on: Oct 22, 2019 | 4:52 PM

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికణం రద్దు వెనుక భారత ప్రభుత్వ ‘ అభివృధ్ది అజెండా ‘ ఏమిటో తమకు తెలుసునని అమెరికా అంటోంది. అయితే ఆ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని యుఎస్ చెబుతోంది. కాశ్మీర్ లోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని దక్షిణాసియా, సెంట్రల్ ఆసియా వ్యవహారాలపై గల అమెరికా విదేశాంగ శాఖలోని తాత్కాలిక కార్యదర్శి అలీస్ వెల్స్ తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుతో బాటు కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5 న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృధ్ది చెందాలని, అవినీతిని అదుపు చేయాలని, ఈ దేశ చట్టాలన్నీ ఉమ్మడిగా ఈ స్టేట్ కు వర్తింపజేయాలని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ముఖ్యంగా కాశ్మీర్లో మహిళలు, మైనారిటీల అభివృద్ధే ధ్యేయమని పేర్కొంది. ఈ ప్రకటన నేపథ్యంలోనే తాము కాశ్మీర్లోని పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్టు అలీస్ వెల్స్ అంటున్నారు. ఈ లక్ష్యాలన్నిటికీ మేం మద్దతు తెలుపుతున్నాం.. కానీ ఆ రాష్ట్రంలోని పరిస్థితే మాకు ఆందోళన కలిగిస్తోంది అని ఆమె వివరించారు. ఆగస్టు 5 నుంచి కాశ్మీర్లో సుమారు 80 లక్షల మంది ప్రజలపై భారత ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం పడిందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఓ స్టేట్ మెంట్ ను అలీస్ కాంగ్రెస్ సభ్యులతో కూడిన కమిటీకి సమర్పించారు. ‘ దక్షిణాసియాలో మానవ హక్కులు-విదేశాంగ శాఖ అభిప్రాయాలు ‘ అన్న అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోంది. జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగు పడినప్పటికీ.. కాశ్మీర్ లోయలో మాత్రం ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడలేదని అలీస్ విచారం వ్యక్తం చేశారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో బాటు పలువురు రాజకీయ నేతలను, ఇతర ప్రముఖులను భారత ప్రభుత్వం నిర్బంధించడం ఆందోళనకరంగా ఉంది అని ఆమె అన్నారు. మానవ హక్కులను గౌరవించాలని, ఇంటర్నెట్, మొబైల్ నెట్ వర్క్ లను, ఇతర ప్రజా సేవలను పునరుధ్ధరించాలని కోరుతున్నామన్నారు. కాశ్మీర్లో పోస్ట్ పెయిడ్ మొబైల్ సర్వీసులను పునరుధ్ధరించినప్పటికీ, ఇంటర్నెట్ యాక్సెస్ పై ఇంకా ఆంక్షలున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని విదేశీ, స్థానిక జర్నలిస్టులు అన్ని అంశాలనూ కవర్ చేస్తున్నా.. సెక్యూరిటీ ఆంక్షల ఫలితంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు అని అలీస్ తెలిపారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అనేకమందిని అదుపులోకి తీసుకున్నారని, వీరిలో చాలామందిపై ఎలాంటి అభియోగాలు లేనట్టు తెలిసిందని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు, ప్రారంభమైనా .. విద్యార్థుల హాజరీ చాలా తక్కువగా ఉందన్నారు. కాశ్మీర్ కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు నవంబర్ 14 న విచారణ జరపబోతోంది.. అలాగే జమ్మూకాశ్మీర్ హైకోర్టు పెండింగులో ఉన్న కేసులను సమీక్షిస్తోంది అని అలీస్ వెల్స్.. మన దేశంలోని మేధావులకు తెలిసిందానికన్నా ఎక్కువ తెలిసినదానిలా వివరించింది. సాధ్యమైనంత త్వరగా ఎస్సెమ్మెస్ లతో సహా ఇంటర్నెట్ సర్వీసులను పునరుధ్ధారించాలని ఆమె మళ్ళీ మళ్ళీ కోరారు.

భారత్-పాక్ చర్చలు జరపాల్సిందే !

1972 నాటి సిమ్లా ఒప్పందం నేపథ్యంలో భారత, పాకిస్తాన్ దేశాలమధ్య నేరుగా చర్చలు జరగాలన్న ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామని అమెరికా కోరింది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న టెర్రరిస్టులకు పాక్ ఇంకా మద్దతునిస్తున్నందున ఇదే చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారిందని అలీస్ అభిప్రాయపడ్డారు. 2006.. 07 మధ్య కాలంలో ఆ రెండు దేశాలు కాశ్మీర్ పై చర్చల విషయంలో ఎంతో పురోగతి సాధించాయి.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడాలని కోరుతున్నాం అన్నారు.. ‘ ఏది సాధ్యం అన్నదాన్ని చరిత్ర చెబుతోంది ‘ అని ఆమె వ్యాఖ్యానించారు. భారత, పాకిస్థాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించాలని మళ్ళీ మళ్ళీ అభ్యర్థిస్తున్నాం అన్నారు. కాశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్న తమ దేశ ఉగ్రవాదులు అటు కాశ్మీరీలకు, ఇటు పాకిస్థాన్ కు కూడా శత్రులేనని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనపట్ల అలీస్ హర్షం వ్యక్తం చేశారు. కాశ్మీరీలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ.. ఉగ్రవాదులు హింసకు పాల్పడుతూ చర్చలకు అడ్డంకిగా మారడాన్ని ఖండిస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు