డాలస్‌లో ప్రవాస చిన్నారులకు చదరంగం పోటీలు నిర్వహించింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం. మే 24,25,26 తేదీలలో అర్వింగ్‌లో నాట్స్ తెలుగు సంబరాలు జరగనున్నాయి. వీటిలో భాగంగా ఈ చెస్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. వయసు ప్రాతిపదికన పిల్లలకు మూడు దశల్లో పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొని పోటీలను జయప్రదం చేశారు.