ట్రంప్ వార్నింగ్.. కాంగ్రెస్ నేత శశిథరూర్ మండిపాటు.. మరీ ఇంత దూకుడా ?

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును తమ దేశానికి పంపడానికి ఇండియా నిరాకరించిన పక్షంలో .. ఆ దేశంపై తాము ప్రతీకార చర్యకు దిగవచ్చునంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మండిపడ్డారు...

ట్రంప్ వార్నింగ్.. కాంగ్రెస్ నేత శశిథరూర్ మండిపాటు.. మరీ ఇంత దూకుడా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 07, 2020 | 12:59 PM

కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును తమ దేశానికి పంపడానికి ఇండియా నిరాకరించిన పక్షంలో .. ఆ దేశంపై తాము ప్రతీకార చర్యకు దిగవచ్చునంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మండిపడ్డారు. ప్రపంచ వ్యవహారాల్లో ఇన్ని దశాబ్దాల కాలంలో ఒక దేశాధినేత ఇండియాను ఇలా హెచ్చరించడాన్ని తాను చూడలేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ మందును మీకు అమ్మాలని మా దేశం నిర్ణయించినప్పుడే అది మీ మందు అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన అనుభవం ఉన్న శశిథరూర్.. ట్రంప్  ఇఛ్చిన వార్నింగ్ తాలూకు వీడియోను కూడా పోస్ట్ చేశారు. కాగా ట్రంప్ ఇలా హెచ్ఛరించిన కొన్ని గంటల్లోనే కరోనా బాధిత దేశాల్లో కొన్నింటికి ఈ మెడిసిన్ ఎగుమతి చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం విశేషం.