అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కలిసి రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ఓకే చెప్పింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. ఈ టీకా వినియోగానికి ఇవ్వాల్సిన అనుమతులపై ఎనిమిది గంటల సేపు చర్చించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్స్, వ్యాక్సిన్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వయిజరీ కమిటీ 17-4 ఓట్లతో టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై ఆందోళనలు వస్తున్నా సమయంలో ఈ టీకా వినియోగానికి అనుమతి విషయంలో ఆలస్యం జరుగుతుందన్న ప్రచారానికి ఎఫ్‌డీఏ తెర దించింది. లాంఛనంగా ఎఫ్‌డీఏ ఆమోదం పొందాక వచ్చే వారం నుంచి అమెరికాలో భారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సన్నహాలు చేస్తున్నారు.