అమెరికా అధ్యక్షులవారి ఆరోగ్యం ఓకేనా ? విమానం ఎక్కబోతూ మెట్లపై మూడుసార్లు పడిపోబోయిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆరోగ్యంపై సందేహాలు కలుగుతున్నాయి. 78 ఏళ్ళ బైడెన్ శుక్రవారం అట్లాంటా వెళ్లేందుకు వాషింగ్టన్ లో విమానం ఎక్కుతూ మధ్యలో మూడు సార్లు కాలు జారిపడి పడిపోబోయిన..

  • Umakanth Rao
  • Publish Date - 11:32 am, Sat, 20 March 21
అమెరికా అధ్యక్షులవారి ఆరోగ్యం ఓకేనా ? విమానం ఎక్కబోతూ మెట్లపై మూడుసార్లు పడిపోబోయిన బైడెన్
He Is Doing Fine Says Whitehouse Official Spokespeerson On Baiden Trips 3 Times

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆరోగ్యంపై సందేహాలు కలుగుతున్నాయి. 78 ఏళ్ళ బైడెన్ శుక్రవారం అట్లాంటా వెళ్లేందుకు వాషింగ్టన్ లో విమానం ఎక్కుతూ మధ్యలో మూడు సార్లు కాలు జారిపడి పడిపోబోయిన  వైనం ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది.  అధ్యక్షులకు ఉద్దేశించిన ఈ విమానం ఎక్కుతూ మధ్యలో ఆయన ఒకసారి కాలు జారడంతో తడబడ్డారు. దాంతో ఆధారంగా కుడి చేత్తో రైలింగ్ పట్టుకుని మళ్ళీ లేచి మరో మెట్టు ఎక్కబోతూ తిరిగి తొట్రుపాటు పడ్డారు. ఇలా మూడుసార్లు జరిగింది.  చివరకు ఎలాగైతేనేం ?  ఇదేమీ  పెద్ద విషయం కాదన్నట్టు పూర్తిగా విమానం ఎక్కి , తనకోసం  చూస్తున్న వారికి  విష్ చేసి విమానం లోపలికి  ఎంటరయ్యారు.   అయినా అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన వ్యక్తి వెంట అనుక్షణం భద్రతా సిబ్బంది ఉండాలి. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా.. ఇలా విమానాలు ఎక్కుతున్నా లేదా దిగుతున్న వారు 24 గంటలూ ఆయన వెంట ఉండాల్సిందే. కానీ మరి జోబైడెన్మాత్రం తన వెంట ఇలా భద్రతా అధికారులను నియమించుకోలేదా ? లేక వారి అవసరం తనకు అంతగా లేదనుకున్నారా ? ఈ వయస్సులో ఉన్న ఈయన ఈ అంశాన్ని ఎందుకు పక్కన పెట్టారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

He Is Doing Fine Says Whitehouse Official Spokespeerson On Baiden Trips 3 Times

He Is Doing Fine Says Whitehouse Official Spokespeerson On Baiden Trips 3 Times

లోగడ కూడా తన ఎన్నికల ప్రచార సందర్భంలో జోబైడెన్.. స్టేజీ ఎక్కేముందు, దిగేముందు తొట్రుపాటు పడ్డారని వార్తలు వచ్చ్చాయి . కనీసం అప్పుడైనా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉండింది. శారీరకంగా బలహీనంగా ఉండడమే కాదు.. తన వయస్సు రీత్యా కూడా  బైడెన్ తన ఆరోగ్యం పట్ల చాలా జాగరూకత తీసుకోవలసి ఉందని అంటున్నారు. బైడెన్ ఆరోగ్యంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మధ్యే సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. తనను కిల్లర్ అంటూ ఆయన చేసిన కామెంట్ పై స్పందించిన పుతిన్… తన ప్రసంగం మొదట్లోనే ఈ వ్యాఖ్య చేశారు. కాగా-బైడెన్ విమానం ఎక్కబోతూ మూడు సార్లు పడిపోబోయిన ఘటనపై వైట్ హౌస్ స్పందిస్తూ..బైడెన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆ సమయంలో గాలి విపరీతంగా వీస్తున్న కారణంగా ఈ అనుకోని సంఘటన జరిగిందని ఈ హౌస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.
 ‘క్యాట్ షేరింగ్.. కేరింగ్..’ ఆ పిల్లులు ఎంత ప్రాణ స్నేహితులో… ఈ వీడియోని చూసి నెటిజెన్స్ ఫిదా.. ( వీడియో )