ప్రైమ్ డే జోరులో ఉన్న అమెజాన్‌కు ఆ సంస్థ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. తమ జీతాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు. అమెజాన్ సంస్థ తమతో ఎక్కువ గంటలపాటు పని చేయిస్తూ.. తక్కువ జీతాలు చెల్లిస్తోందని మండిపడుతున్నారు. అయితే కార్మికుల అడిగినవన్నీ ఇచ్చేశామని అమెజాన్ సంస్థ అధికారులు చెబుతున్నారు. ట్రేడ్ యూనియన్ల ప్రతిపాదనలు మాత్రమే అంగీకరించబోమని స్పష్టం చేసింది.