తెలుగు భాష తియ్యదనం.. గురించి కవులు, కళాకారులు చెప్తే విన్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన మహానుభావులు గేయాలు చదువుకున్నాం. కానీ ఇప్పుడు తెలుగువారే మాతృభాషలో మాట్లాడితే.. చులకనగా చూస్తారేమోనని ఫీలవుతున్న రోజులివి. ఐతే తెలుగు భాష కమ్మదనం గురించి గొప్పగా చెబుతున్నాడు ఓ అమెరికన్. అంతేకాగా.. తెలుగులో చక్కగా మాట్లాడుతూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు.